బ్లాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. 

షేర్ చేయండి:
బ్లాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. 

సాక్షి లైఫ్ : వంటగదిలో అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలు సాధారణమైనవిగా అనిపించవచ్చు. కానీ వాటిలో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి.నల్ల ఉప్పు కూడా అలాంటిదే. సరైన పరిమాణంలో తినడం ద్వారా, మీ జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.ప్రతి భారతీయ వంటగదిలో సులభంగా లభించే బ్లాక్ సాల్ట్ చాట్ లేదా సలాడ్ అయినా వాటి రుచిని పెంచడమే కాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది అనేక యాంటీఆక్సిడెంట్లు కలిగిన పోషకాల నిధి. 

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..? 

 

బ్లాక్ సాల్ట్ ను ప్రతి ఇంట్లో వివిధ ఆహారపదార్థాలు, పలురకాల పానీయాలలో ఉపయోగిస్తారు. ఇందులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలతో సమృద్ధిగా ఉండే ఈ ఉప్పు ఆహారపు రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచిఉపశమనం కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడే ఈ నల్ల ఉప్పు చాలాబాగా పనిచేస్తుంది.  
 
 ఎసిడిటీ.. 

నల్ల ఉప్పు ఎసిడిటీ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. తరచుగా గ్యాస్ ,అసిడిటీ వంటి సమస్యలను నిరోధించడంలో నల్ల ఉప్పు మంచి పనితీరును కనబరుస్తుంది. బ్లాక్ సాల్ట్ కాలేయ ఆరోగ్యానికి కూడా మంచిదని కొన్ని అధ్యయనాలలో కూడా తేలింది.


మెరుగైన జీర్ణక్రియ.. 
 
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా, చాలా మంది ప్రజలు పేలవమైన జీర్ణక్రియ గురించి ఫిర్యాదు చేస్తున్నారు. అలాంటి వారికి కూడా చిటికెడు నల్ల ఉప్పు చాలా మేలు చేస్తుంది. కడుపు నొప్పిని శాంతపరచడానికి ఇది పనిచేస్తుంది.

గుండె ఆరోగ్యానికి మంచిది.. 

చెడు కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి కూడా దీని వినియోగం చాలా మంచిది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మితిమీరి ఎలాంటిది తీసుకున్నా హానికరం కాబట్టి, దీనిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.

బరువు తగ్గడానికి..

బరువు తగ్గడానికి ప్రభావవంతంగా ఉంటుంది. నల్ల ఉప్పులో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ ఆహారంలో సలాడ్, పానీయం వంటి మొదలైన వాటిల్లో నల్ల ఉప్పును వేసుకుంటే, అది బరువును తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.