పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పనీర్ అత్యంత పోషకమైన పాల ఉత్పత్తులలో ఒకటి. పాలలో ఉప ఉత్పత్తి అయిన పనీర్‌లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పనీర్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఫాస్పరస్, విటమిన్లు ,మినరల్స్ వంటి శరీర పెరుగుదలకు సహాయపడే అనేక అంశాలు వీటిలో ఉంటాయి. పనీర్‌లో రెండు రకాలు ఉన్నాయి. సాఫ్ట్ పనీర్, హార్డ్ పనీర్. ఆహారంలో పనీర్‌ను చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..  

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?

ఇది కూడా చదవండి..కిడ్నీ దానం ఎలాంటి వాళ్లు చేయవచ్చు..?   

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఎముకలు, దంతాల పెరుగుదలకు..

పనీర్‌లోని కాల్షియం, ఫాస్పరస్ ఎముకలు, దంతాల పెరుగుదలకు సహాయపడుతుంది. ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ వంటి ఎముకలకు సంబంధించిన వ్యాధులను కొంత వరకు నివారించడంలో పనీర్ మంచి పనితీరుకనబరుస్తుంది. పనీర్‌లో ఉండే మినరల్స్ చిగుళ్ల వ్యాధులు , దంత వ్యాధులను నివారిస్తాయి.

పోస్ట్ వర్కౌట్ డైట్‌లో.. 

పనీర్ ఇన్స్టంట్ గా శక్తిని అందించే వనరు. వ్యాయామం చేసే క్రీడాకారులు పోస్ట్ వర్కౌట్ డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన పోషకాహారం ఇది. పనీర్ లో విటమిన్ "డి" పుష్కలంగా ఉండటం వల్ల దంత క్షయాన్ని నివారిస్తుంది. పిల్లల ఆహారంలో పనీర్‌ను ఖచ్చితంగా చేర్చాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు.

 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.