స్ట్రాబెర్రీస్ తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. 

షేర్ చేయండి:
స్ట్రాబెర్రీస్ తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. 

సాక్షి లైఫ్ : గుండె ఆరోగ్యం కోసం.. స్ట్రాబెర్రీస్‌లో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లావనాయిడ్లు ,విటమిన్లు ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. వీటిలో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లామేటరీ గుణాలు రక్త పోటు తగ్గించి, రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

 

ఇది కూడా చదవండి..శిరోజాల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలు అందించే చిలగడదుంప..

ఇది కూడా చదవండి..బాణాసంచా కాల్చడం వల్ల ఎలాంటి వారిపై ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది..?

 

జీర్ణ సమస్యలకు.. 

స్ట్రాబెర్రీస్‌లో ఎక్కువగా పాలీఫెనోల్స్ అండ్ ఫైబర్ ఉంటాయి, ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, జీర్ణ సంబంధించి సమస్యలను తగ్గిస్తాయి. అలాగే, ఇది బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

 
స్ట్రాబెర్రీస్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. వైరస్‌లు, బ్యాక్టీరియాలను ఎదుర్కొనడంలో శరీరానికి సహాయపడుతుంది.

చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో.. 

స్ట్రాబెర్రీస్‌లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది చర్మంలోని రంధ్రాలను కడిగే విధంగా పనిచేస్తూ, చర్మ కాంతిని కాపాడుతుంది.

 రక్తాన్ని శుద్ధి చేయడంలో.. 

స్ట్రాబెర్రీస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా యాంథోసయనిన్స్, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి. ఇది రక్తంలోని టాక్సిన్లను బయటకు పోయేలా చేయడంలోనూ, అలాగే గుండెకు సరైన రక్తప్రవాహాన్ని అందించడంలో ఉపయోగపడుతుంది.

 

ఇది కూడా చదవండి..మనిషి శరీరానికి ఎన్నిరకాల విటమిన్లు అవసరం..?

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.