శిరోజాల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలు అందించే చిలగడదుంప..  

సాక్షి లైఫ్ : ఉపవాస సమయంలో ఎక్కువమంది చిలగడదుంప తింటారు. ఇది ప్రతిరోజూ తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనకరంగా ఉంటుంది. అనేక రకాల పోషకాలు, ఖనిజాలు చిలగడదుంపలో ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి అలాగే జుట్టుకు, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చిలగడదుంపను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. 

ఆకు కూరలు కాకుండా, కొన్ని రూట్ వెజిటేబుల్స్ కూడా ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి చర్మం, జుట్టు సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తాయి. చిలగడదుంపను  ఇంగ్లిష్ లో స్వీట్ పొటాటో అని అంటారు. చిలగడదుంపలో అనేక ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..?  

ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..

ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?

ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్‌ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే.. 

 
 సూర్యరశ్మి నుంచి రక్షణ : చిలగడదుంపలు బీటా-కెరోటిన్ కు ఉత్తమ వనరులలో ఒకటి. బీటా-కెరోటిన్ అనేది సూర్యకిరణాల వల్ల కలిగే ప్రభావం నుంచి చర్మాన్ని రక్షించడానికి ఉపయోగపడే యాంటీఆక్సిడెంట్.

 మెరిసే చర్మం కోసం : బీటా-కెరోటిన్ ఉన్న ఆహార పదార్థాలను తినడం వల్ల చర్మం మెరుస్తుంది. చిలగడదుంపలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని కూడా తగ్గించడంలో సహాయపడతాయి.  ఇవి దీర్ఘకాలంలో చర్మానికి మేలు చేస్తాయి.

 యాంటీ ఏజింగ్ : స్వీట్ పొటాటోలో విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ కొల్లాజెన్ సంశ్లేషణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది చర్మ సంరక్షణలో మంచి పనితీరు కనబరుస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే విటమిన్ "ఏ" కూడా చర్మం ముడతలుపడకుండా, పొడిబారకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.  

 మచ్చలను తగ్గిస్తుంది: స్వీట్ పొటాటోలో యాంటీ ఆక్సిడెంట్స్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన యాంథోసైనిన్స్ ఉంటాయి. ఇవి నల్లని మచ్చలను నివారించడంలో సహాయపడతాయి. 

 జుట్టుకు మేలు : చిలగడదుంపలో ఉండే బీటా-కెరోటిన్ పదార్ధం జుట్టు రాలడం,  పల్చబడాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. విటమిన్ ఏ , సి కాకుండా, ఈ కూరగాయలలో విటమిన్లు బి, ఇ అలాగే పొటాషియం, మాంగనీస్ మొదలైన ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలన్నీ ఆరోగ్యానికి అలాగే జుట్టుకు మేలు చేస్తాయి.  అంతేకాదు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడతాయి.

 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ అంటువ్యాధా..? కాదా..?

ఇది కూడా చదవండి..పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ కు కీమోథెరపీతో చికిత్స చేయవచ్చా..?

ఇది కూడా చదవండి..చికిత్సతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా..? 

ఇది కూడా చదవండి..అపోహలు-వాస్తవాలు : వృద్ధులలో మాత్రమే బ్లడ్ క్యాన్సర్ వస్తుందా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : hair-loss hair-fall-problem healthy-hair potatoes health-benefits-of-sweet-potatoes potato benefits-of-sweet-potatoes sweet-potatoes benefits-of-sweet-potato sweet-potato-health-benefits sweet-potatoes-health-benefits sweet-potatoes-benefits benefits-of-eating-sweet-potatoes are-sweet-potatoes-healthy what-are-the-health-benefits-of-eating-sweet-potato 7-health-benefits-of-sweet-potatoes benefits-of-sweet-potatoes-for-health proven-health-benefits-of-sweet-potatoes health-benefits-of-sweet-potatos
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com