బాణాసంచా కాల్చడం వల్ల ఎలాంటి వారిపై ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది..? 

సాక్షి లైఫ్ : దీపావళి అనేది దీప కాంతులతో ఆనందంగా జరుపుకునే పండుగ. కానీ ఆరోగ్యభద్రతను విస్మరించవద్దు. ఇది వెలుగులు నింపే పండుగ. కానీ శబ్దం, పొగ నింపే పండుగ కాదు. బాణాసంచా కాల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలున్న వాళ్లు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. దీపావళి సమయంలో పొగ గాలిలోని పొల్యూషన్ ను పెంచుతుంది.

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

 

ఆస్తమా రోగులు ఈ కలుషితమైన గాలిని పీల్చినప్పుడు, వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడాల్సివస్తుంది. అలాంటి రోగులు బాణాసంచా పొగకు దూరంగా ఉండాలి. అనారోగ్య సమస్యలున్న వారు బాణాసంచాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కాలుష్యం నుంచి రక్షించుకోవడానికి ఇంట్లో కూడా మాస్క్ ఉపయోగించాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.  

శబ్ద కాలుష్యాన్ని నివారించండి..

చాలా వరకు పటాకులు 80 డెసిబుల్స్ కంటే ఎక్కువ ధ్వనిని విడుదల చేస్తాయి. దీని వల్ల చెవుడు, రక్తపోటు, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయి. పిల్లలు, గర్భిణీ స్త్రీలు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు అధిక శబ్దం, కాలుష్యం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. గాలిలో గన్‌పౌడర్‌తో కలిపిన ధూళి కణాలు, పొగతో ఎక్కువసేపు ఉండే వ్యక్తులు దగ్గు, కళ్లలో మంట, చర్మంపై దద్దుర్లు ,వాంతులు అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. 

 బాణసంచా కాల్చడం వల్ల చర్మం, వెంట్రుకలు, కళ్లకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పటాకుల్లో ఉండే హానికరమైన రసాయనాలు చర్మం పొడిబారేలా చేయడంతోపాటు స్కిన్ అలర్జీని కలిగిస్తాయి. పర్యావరణంలో హానికరమైన రసాయనాల వ్యాప్తి కారణంగా, జుట్టు కుదుళ్లు బలహీనంగా మారతాయి. తద్వారా జుట్టు రాలు సమస్య మరింతగా పెరుగుతుంది. 

 

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : air-pollution lungs-diseases asthma-children airpollution heart-problems side-effects pollution-effect asthma pollution lungs-health lung-problems lung-cancer-treatment causes-for-cardiac-arrest diwali fireworks
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com