పరోక్ష ధూమపానం, వంటింటి పొగే లంగ్ క్యాన్సర్ కు ప్రధాన కారణాలా..?  

షేర్ చేయండి:
పరోక్ష ధూమపానం, వంటింటి పొగే లంగ్ క్యాన్సర్ కు ప్రధాన కారణాలా..?  

సాక్షి లైఫ్ : మహిళలు తక్కువ సంఖ్యలో ధూమపానం చేసినప్పటికీ, వారికి క్యాన్సర్ రావడానికి పరోక్ష ధూమపానం (పాసివ్ స్మోకింగ్), వంటగది పొగ (బయోమాస్ ఇంధనాల పొగ, ఉదాహరణకు పిడకలు, బొగ్గు, కట్టెలు) ప్రధాన కారణాలుగా గుర్తించారు. దేశంలో 23 శాతం మంది పురుషులు ధూమపానం చేస్తుండగా, కేవలం 1.3 శాతం మంది మహిళలు మాత్రమే ధూమపానం చేస్తున్నారు. కానీ 37.5 శాతం మంది మహిళలు తమ భర్తలు లేదా కుటుంబ సభ్యులు ధూమపానం చేయడం వల్ల పరోక్ష ధూమపానానికి గురవుతున్నారు.

 

ఇది కూడా చదవండి..గబ్బిలాల్లో 20 కొత్త వైరస్ లను గుర్తించిన శాస్త్రవేత్తలు.. 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

 

 

చికిత్సలో ఆలస్యం పెను సమస్య: ఈ అధ్యయనం ప్రకారం, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు చికిత్సలో ఆలస్యం ఒక పెద్ద సమస్యగా మారింది. మూడింట ఒక వంతు మంది రోగులు పరీక్ష తర్వాత 7 నుంచి 30 రోజుల తర్వాత గానీ క్యాన్సర్ ఆసుపత్రులకు చేరుకోవడం లేదు. దీనివల్ల 50.7 శాతం మంది రోగులలో వ్యాధి అప్పటికే ముదిరిపోతోంది.

  శస్త్రచికిత్స: వ్యాధి ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, చాలా తక్కువ మంది రోగులు మాత్రమే శస్త్రచికిత్స చేయించుకోగలుగుతున్నారు. ప్రారంభ దశలో ఉన్న పురుషులలో 5.9 శాతం మంది, మహిళలలో 8.4 శాతం మంది మాత్రమే శస్త్రచికిత్స చేయించుకున్నారు. చాలా మంది రోగులకు కీమోథెరపీ, రేడియోథెరపీ ద్వారా మాత్రమే చికిత్స చేస్తున్నారు. ముదిరిన దశలో ఉన్న 77.7 శాతం మంది రోగులకు నొప్పిని తగ్గించడానికి మాత్రమే ఉపశమన చికిత్స అందిస్తున్నారు.

పరిశోధన.. 

ఎయిమ్స్ క్యాన్సర్ సెంటర్ ,ఐసీఏఎమ్మార్ కి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ (ఎన్ సిడిఐఆర్) సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. 2012-19 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 96 ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చిన 45,228 మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగుల డేటాను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. ఇందులో 34,395 మంది పురుషులు10,833, మంది మహిళా రోగులు ఉన్నారు. ఈ పరిశోధన వివరాలు ఇటీవల "లంగ్ ఇండియా" జర్నల్‌లో ప్రచురించారు.

మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం, చికిత్సలో జాప్యం వంటి అంశాలపై ఈ అధ్యయనం కీలక వివరాలను అందించింది. పరోక్ష ధూమపానం, వంటగది పొగ వంటి అంశాలపై అవగాహన కల్పించి, ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స అందించడం ద్వారా మరణాల రేటును తగ్గించవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.