సైనసైటిస్‌తో బాధపడుతున్నారా? అలర్జీలు రాకుండా ఇలా చేయండి..!
సాక్షి లైఫ్ : సైనసైటిస్ అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే ఒక సాధారణ సమస్య. ముక్కు దిబ్బడ, తలనొప్పి, ముఖంపై ఒత్తిడి వంటి లక్షణాలు దీనితో ముడిపడి ఉంటాయి. అయితే, సైనసైటిస్ ఉన్నవారికి అలర్జీలు తోడైతే, పరిస్థితి మరింత జఠిలమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి, సైనసైటిస్‌తో బాధపడుతున్నవారు అలర్జీలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రముఖ వైద్యులు డా. ధీరజ్ సాక్షి లైఫ్ కు విలువైన సమాచారం అందించారు.
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
అలర్జీలు-సైనసైటిస్..
సైనస్‌లు అనేవి మన ముఖంలోని ఎముకలలో గాలితో నిండిన చిన్న గదులు. ఇవి మనం పీల్చే గాలిని తేమగా, వెచ్చగా మార్చి, దుమ్ము, ధూళి వంటి కణాలను వడబోసి ఊపిరితిత్తుల్లోకి పంపుతాయి. అయితే, అలర్జీలు ఉన్నవారిలో ముక్కులోని శ్లేష్మ పొరలు ఉబ్బి, సైనస్‌ల నుంచి శ్లేష్మం బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోతాయి. దీంతో సైనస్‌లలో శ్లేష్మం పేరుకుపోయి, బాక్టీరియా వృద్ధి చెంది, ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఇదే సైనసైటిస్.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
