అనుమతులు లేని ఆటిజం థెరపీ సెంటర్లతో పిల్లల ప్రాణాలకు ముప్పు..
సాక్షి లైఫ్ : ఇటీవల తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నకిలీ డాక్టర్లను గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకున్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు. హైదరాబాద్ నగరంతో పాటు అనేక జిల్లాల్లో సైతం ఇలాంటి నకిలీ డాక్టర్లను ఏరివేసి జనాలకు ఎంతోకొంత మేలుచేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆటిజం థెరపీ కేంద్రాలపేరుతో మార్కెట్ లో చెలామణీ అవుతూ చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి.
ఇది కూడా చదవండి..ఫస్ట్ యాంటీబయాటిక్ స్మార్ట్ సెంటర్..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.
ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?
అనుమతులు లేని..
ఆటిజం అనేది ఇరవై ఒకటి రకాల వైకల్యాల్లో ఒకటి. ఈ వైకల్యం ఉన్న పిల్లలు చిన్న వయస్సులోనే సరైన సమయంలో గుర్తించి తగిన వైద్యం అందించడం ద్వారా వారిని ఆయా సమస్య నుంచి కాపాడవచ్చు. కానీ, ప్రభుత్వ స్థాయిలో సరైన సదుపాయాలు లేకుండా, తగిన అర్హత, అనుమతులు లేని అక్రమ థెరపీ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.
వీటికి సరైన అనుమతులు లేకపోవడంతో పాటు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫరెంట్ అబిలిటీస్ అండ్ ఎల్డర్ వెల్ఫేర్ (డిడిఈడబ్ల్యూ) మార్గదర్శకాలు పాటించకుండా, ఆటిజం, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ , స్పీచ్ డిలే వంటి న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు నాసిరకం, మోసపూరిత థెరపీలు అందించడం వల్ల పిల్లల జీవితాలే ప్రశ్నార్థకమవుతూ, మంచి జరగక పోగా హాని జరుగుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి ఆటిజం థెరపీ సెంటర్లలో..
తమ పిల్లలు ఇలాంటి ఆటిజం థెరపీ సెంటర్లలో సరైన చికిత్స పొందితే వారి జీవితం బావుంటుందని నమ్మి అక్కడికి వెళితే వారి స్వార్ధానికి తమ పిల్లలకు సరైన ట్రీట్మెంట్ యివ్వకుండా మోసం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇలాంటి అక్రమ ఆటిజం థెరపీ సెంటర్లను తక్షణమే మూసివేయాలని, సరైన అనుమతులు ఉన్న వాటిని మాత్రమే అనుమతించాలని వారు కోరుతున్నారు.
అసలే వైకల్యంతో బాధపడుతున్న, చిన్నారుల జీవితాలతో, వారి తలిదండ్రులు, కుటుంబాలతో చెలగాటమాడుతున్నఈ అక్రమ థెరపీ సెంటర్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వెంటనే , ఈ అక్రమ థెరపీ సెంటర్లను మూసి వేయించాలని చిన్నారుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
