Be Alert : బీ అలెర్ట్.. ఇలాంటి 'హెల్త్ ఇన్సూరెన్స్' ప్రాణాలకే ముప్పు.. ఎందుకంటే..?
సాక్షి లైఫ్ : సాధారణంగా ఆరోగ్య బీమా (Health Insurance) ఉంటే కొండంత ధీమా అనుకుంటాం. కానీ, తక్కువ ప్రీమియం కోసం మనం ఎంచుకునే కొన్ని రకాల పాలసీలే ప్రాణాంతకంగా మారుతున్నాయని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా 'హై డిడక్టబుల్ హెల్త్ ప్లాన్స్' (HDHP) వల్ల క్యాన్సర్ బాధితుల్లో మరణాల ముప్పు పెరుగుతున్నట్లు 'జామా నెట్‌వర్క్ ఓపెన్' (JAMA Network Open) పరిశోధనలో వెల్లడైంది.
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
అసలు ఈ ప్లాన్లలో ఉన్న తిరకాసు ఏంటి..? అది రోగుల ప్రాణాల మీదకు ఎలా వస్తోంది..?
ఏమిటీ 'హై డిడక్టబుల్' ప్లాన్..?
సాధారణంగా బీమా కంపెనీ తన వాటా చెల్లించడానికంటే ముందు.. పాలసీదారుడు తన జేబు నుంచి కొంత మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది. దీన్నే 'డిడక్టబుల్' అంటారు. తక్కువ నెలవారీ ప్రీమియం కోసం చాలామంది ఎక్కువ డిడక్టబుల్ ఉండే ప్లాన్లను ఎంచుకుంటారు.
ప్రస్తుత పరిస్థితి తరుణంలో అమెరికా వంటి దేశాల్లోఈ ఏడాది డిడక్టబుల్ ధరలు ఆకాశాన్నంటాయి. ఉదాహరణకు, బ్రాంజ్ ప్లాన్లలో ఒక వ్యక్తి సుమారు 7,500 డాలర్లు దాదాపు రూ. 6.2 లక్షలు తన జేబు నుంచి ఖర్చు పెట్టాకే ఇన్సూరెన్స్ కంపెనీ సాయం అందుతుంది.
ఈ అధ్యయనంలో దిగ్భ్రాంతికర విషయాలు..
మెయో క్లినిక్ శాస్త్రవేత్త జస్టిన్ బార్నెస్ నేతృత్వంలో 1.47 లక్షల మందిపై జరిగిన ఈ అధ్యయనంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణ ప్లాన్లు ఉన్నవారితో పోలిస్తే, హై డిడక్టబుల్ ప్లాన్లు ఉన్న క్యాన్సర్ బాధితుల్లో మరణించే అవకాశం 46 శాతం ఎక్కువగా ఉంది. కేవలం క్యాన్సర్ వల్లే చనిపోయే ముప్పు వీరికి 34 శాతం అధికంగా ఉంది. ఈ ప్లాన్లలో ఉన్నవారు చికిత్స ఖర్చులకు భయపడి మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు గుర్తించారు.
ప్రాణాల మీదకు ఎలా వస్తుంది..?
ఎక్కువ డిడక్టబుల్ ఉండటం వల్ల రోగులు తీసుకునే నిర్ణయాలు వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి.వైద్యుడి వద్దకు వెళ్లడంలో ఆలస్యం..జేబు నుంచి డబ్బులు కట్టాలి కదా అని చిన్న చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేస్తారు. రోగ నిర్ధారణ పరీక్షలు (Diagnostics) ఖరీదైనవి కావడంతో వాటిని వాయిదా వేస్తారు. దీనివల్ల క్యాన్సర్ ముదిరిపోతుంది. చికిత్స మధ్యలో ఆపేయడం, మందులు, కీమోథెరపీ ఖర్చుల భయంతో సగం చికిత్సతోనే సరిపెట్టుకుంటున్నారు.
ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ ప్లాన్ల వల్ల ఇబ్బంది లేకపోవచ్చు. కానీ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సోకినప్పుడు.. ఈ ప్లాన్లు ఆర్థికంగానే కాకుండా, ఆరోగ్యపరంగానూ శాపంగా మారుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
మన దేశంలోనూ అప్రమత్తత అవసరం..
మన దేశంలో కూడా ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కేవలం 'తక్కువ ప్రీమియం' మాత్రమే చూడకూడదు. క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేటుతో పాటు, డిడక్టబుల్స్ ఎంత ఉన్నాయి, మనం ఎంత భరించాలి అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
