Powerful Fruits : దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా..? త్వరగా ఉపశమనం పొందాలంటే ఈ 5 పండ్లు తినాల్సిందే!

సాక్షి లైఫ్ : శీతాకాలం వచ్చిందంటే చాలు, వాతావరణంలో మార్పుల కారణంగా దగ్గు, జలుబు సమస్యలు సర్వసాధారణం. ఈ ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి త్వరగా కోలుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. మందులతో పాటు సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఉపశమనం వేగవంతం అవుతుంది. ముఖ్యంగా, కొన్ని రకాల పండ్లలో ఉండే పోషకాలు, విటమిన్‌లు, యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలో శక్తిని పెంచి, ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందడానికి మీరు తప్పనిసరిగా తినాల్సిన 5 రకాల పండ్లను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

ఇది కూడా చదవండి.. మానసిక సమస్యలకు పరిష్కారాలేంటి..?  

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..Hot Yoga : హాట్ యోగా ఎలాంటి వాళ్లు చేయకూడదు ఎందుకు..?

ఇది కూడా చదవండి..Acanthosis Nigricans : అకాంథోసిస్ నైగ్రికన్స్ అంటే ఏమిటి..?

 

నారింజ (Orange) అండ్ పుల్లని పండ్లు (Citrus Fruits)
కీలక పోషకం.. విటమిన్-సి

నారింజ, నిమ్మ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లు విటమిన్ 'సి'కి అద్భుతమైన వనరులు. ఇది రోగనిరోధక వ్యవస్థకు చాలా అవసరం.

ఎలా పనిచేస్తాయి ఇవి..?

విటమిన్-సి శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని బలోపేతం చేసి, ఇన్‌ఫెక్షన్ల తీవ్రతను తగ్గిస్తుంది. అయితే, గొంతు నొప్పి ఎక్కువగా ఉన్నవారు నిమ్మజాతి పండ్లను నేరుగా కాకుండా, తేలికపాటి వేడి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం మంచిది.

బొప్పాయి (Papaya).. 

కీలక పోషకం: విటమిన్-సి అండ్ బీటా కెరోటిన్..

ఎలా పనిచేస్తాయి ఇవి..?

బొప్పాయి పండులో విటమిన్ 'సి'తో పాటు, శ్లేష్మం (Mucus) వాపును (Inflammation) తగ్గించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఎలా పనిచేస్తాయి ఇవి..? 

జలుబు, దగ్గు నుంచి త్వరగా కోలుకోవడానికి బొప్పాయి సహాయపడుతుంది. ఇందులో ఉండే జీర్ణ ఎంజైమ్‌లు (పపైన్) ఈ సమయంలో ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తాయి.

 అరటిపండు (Banana).. 

కీలక పోషకం: పొటాషియం, బి6, సులభంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు

ఎలా పనిచేస్తాయి ఇవి..?

 అనారోగ్యంతో ఉన్నప్పుడు చాలా మందికి ఆహారం తినాలనిపించదు. అరటిపండు సులభంగా జీర్ణమవుతూ, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఇది మృదువుగా ఉంటుంది కాబట్టి, గొంతు నొప్పి (Sore throat) ఉన్నప్పుడు కూడా సులువుగా తినవచ్చు. దీనిలోని పొటాషియం శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది.

 పైనాపిల్ (Pineapple).. 

కీలక పోషకం: బ్రోమెలైన్ (Bromelain)

ఎలా పనిచేస్తాయి ఇవి..?

 పైనాపిల్‌లో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ (వాపు నిరోధక) లక్షణాలను కలిగి ఉంటుంది.

ఎలా పనిచేస్తాయి ఇవి..?

 దగ్గు, ముక్కు దిబ్బడ (Nasal Congestion) సమస్యలను తగ్గించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది శ్లేష్మాన్ని (కఫం) పలచబరిచి, గొంతులో గరగరను తగ్గిస్తుంది.

 యాపిల్ (Apple).. 

కీలక పోషకం: క్వెర్సెటిన్ (Quercetin)యాంటీఆక్సిడెంట్లు, యాపిల్ పీచు పదార్థం (Fiber)యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం.

ఎలా పనిచేస్తాయి ఇవి..? 

జలుబు, దగ్గు సమయంలో రోగనిరోధక శక్తికి మద్దతు ఇస్తుంది. ముఖ్యంగా యాపిల్ తొక్కలో ఉండే 'క్వెర్సెటిన్' అనే ఫ్లేవనాయిడ్, జలుబు లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఈ పండ్లు తీసుకోవడం మంచిదే అయినప్పటికీ, ఆహారం గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. అతి చల్లని పండ్లు లేదా పండ్ల రసాలు గొంతు నొప్పిని పెంచే ప్రమాదం ఉంది.

ఇది కూడా చదవండి.. హోమియోపతి వైద్యంలో క్యేన్సర్ కు చికిత్స ఉందా..? 

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : cold-problem papaya pineapple amazing-fruits apple citrus-fruits sour-fruits orange-benefits orange-fruit-benefits best-time-to-eat-fruits
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com