New study : కృత్రిమ స్వీటెనర్లు మెదడుకు శత్రువులా..?

సాక్షి లైఫ్ : డైటింగ్ చేసేవారికి, మధుమేహ రోగులకు చక్కెర లేని తియ్యదనం అందించే కృత్రిమ స్వీటెనర్లు (Artificial Sweeteners) మెదడుపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతున్నాయని తాజా అధ్యయనం సంచలనం సృష్టిస్తోంది. ఈ 'చక్కెర ప్రత్యామ్నాయాలు' కేవలం బరువు పెరగకుండా చూడడమే కాకుండా, మెదడు కణాల వృద్ధాప్యాన్ని (Brain Ageing) వేగవంతం చేస్తున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

 

ప్రముఖ అంతర్జాతీయ వైద్య పత్రిక 'న్యూరాలజీ (Neurology)'లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం, ఆస్పర్టేమ్, శాకరిన్, ఎరిథ్రిటాల్ వంటి కృత్రిమ స్వీటెనర్లను అధికంగా వినియోగించే వారిలో జ్ఞాపకశక్తి (Memory) ఆలోచనా సామర్థ్యం (Cognitive Function) వేగంగా క్షీణించినట్లు కనుగొన్నారు.

  మెదడుపై తీవ్ర ప్రభావం.. 

 తరచుగా స్వీటెనర్లను వాడేవారిలో, వారి మెదడు పనితీరు దాదాపు 1.6 అదనపు సంవత్సరాలు వయస్సు పెరిగినట్లుగా క్షీణత కనిపించింది. అంటే, ఈ పదార్థాలు మెదడును త్వరగా వృద్ధాప్యం వైపు నడిపిస్తున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. స్వీటెనర్ల వినియోగం పెరిగే కొద్దీ, జ్ఞాపకశక్తికి సంబంధించిన పరీక్షల్లో వారి పనితీరు గణనీయంగా తగ్గిపోయింది. 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో, ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో ఈ ప్రభావం మరింత బలంగా కనిపించింది.

  ఎందుకు ఇలా జరుగుతోంది అంటే..?

పరిశోధకులు దీనికి ఖచ్చితమైన కారణం చెప్పలేకపోయినా, ఈ కృత్రిమ పదార్థాలు శరీరంలోని కొన్ని ముఖ్యమైన వ్యవస్థలపై ప్రభావం చూపిస్తున్నాయని అనుమానిస్తున్నారు. 

గట్-బ్రెయిన్ యాక్సిస్.. 

 కృత్రిమ స్వీటెనర్లు కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియా (Gut Microbiome) సమతుల్యతను దెబ్బతీసి, తద్వారా మెదడుకు వెళ్లే సంకేతాలను ప్రభావితం చేస్తాయనిపరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఈ పదార్థాలు శరీరంలో దీర్ఘకాలికంగా స్వల్ప వాపును పెంచి, అది మెదడు కణాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని అభిప్రాయపడుతున్నారు.


ఈ అధ్యయనం కేవలం కొన్ని అంశాలను మాత్రమే చూపిస్తుంది, కానీ 'కారణం (Causation)' అని నిరూపించనప్పటికీ, ఆహారంలో కృత్రిమ స్వీటెనర్ల వాడకాన్ని తగ్గించుకోవడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్యాక్ చేసిన డ్రింక్స్, స్వీట్లు, యోగర్ట్స్‌లో ఉండే ఈ స్వీటెనర్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చక్కెర స్థానంలో సహజమైన పండ్ల తీపి లేదా తేనె వంటి వాటిని మితంగా వాడడం ఉత్తమమని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : brain-food brain-health gut-health memory-power memory-loss artificial-sugar artificial-sweeteners brain-food-for-memory foods-to-increase-memory brain-power gut-microbiome-tracking-device microbiome-health-analyzer
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com