Amazing Treatment: హంట్‌ర్ సిండ్రోమ్‌కు 'జీన్ థెరపీ'తో విముక్తి..!

సాక్షి లైఫ్ : నిరుపేద కుటుంబాలకు అందని ద్రాక్షలా ఉన్న అరుదైన, ప్రాణాంతక వ్యాధి 'హంట్‌ర్ సిండ్రోమ్' చికిత్సలో అద్భుతం జరిగింది. ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్న ఓ పసిబిడ్డకు అందించిన వినూత్న 'జీన్ థెరపీ' విజయవంతమైంది. ఈ చికిత్స ద్వారా ఆ చిన్నారిలో మెరుగైన ఆరోగ్య ఫలితాలు కనిపించడం ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగంలో సరికొత్త ఆశలు చిగురింపజేస్తోంది.

 

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

 

 హంట్‌ర్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?

హంట్‌ర్ సిండ్రోమ్ (MPS II) అనేది ఒక అరుదైన జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి శరీరానికి అవసరమైన 'ఐడురోనేట్ సల్ఫాటేజ్' (Iduronate Sulfatase - IDS) అనే ఎంజైమ్‌ను ఉత్పత్తి చేయడంలో లోపం కారణంగా వస్తుంది. ఈ ఎంజైమ్ లేకపోతే, గ్లైకోసమినోగ్లైకాన్స్ (Glycosaminoglycans - GAGs) అనే చక్కెర అణువులు శరీర కణాలలో పోగుపడి, క్రమంగా అవయవాలు, ఎముకలు, కీళ్లు, మెదడు పనితీరును దెబ్బతీస్తాయి. ఈ వ్యాధి సాధారణంగా చిన్ననాటి నుంచే మొదలై, చికిత్స లేకపోతే ప్రాణాంతకంగా మారుతుంది.
 
 జీన్ థెరపీతో వచ్చిన మార్పు.. 

ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్న ఓ చిన్నారికి పరిశోధకులు అత్యాధు నికమైన 'అడెనో-అసోసియేటెడ్ వైరస్ (AAV)' ఆధారిత జీన్ థెరపీని అందించారు. లోపం కలిగిన ఐడురోనేట్ సల్ఫాటేజ్ జన్యువు స్థానంలో, సరైన ఎంజైమ్‌ను ఉత్పత్తి చేసే జన్యువును ఒక సురక్షితమైన వైరస్ వెక్టర్‌ (Vector) ద్వారా రోగి శరీరంలోకి ప్రవేశపెట్టారు. చికిత్స తర్వాత కొన్ని వారాల్లోనే, ఆ చిన్నారి శరీరంలో IDS ఎంజైమ్ స్థాయిలు గణనీయంగా పెరిగాయి. గతంలో తరచుగా వచ్చే శ్వాసకోశ సమస్యలు, కీళ్ల బిగుసుకుపోవడం వంటి లక్షణాలు తగ్గడం మొదలైంది. ముఖ్యంగా, మెదడు పనితీరుకు సంబంధించిన లోపాలు కూడా మెరుగుపడ్డాయని వైద్యులు గుర్తించారు.

  పేదలకు అందుబాటులోకి వచ్చేనా..?

ప్రస్తుతం ఈ జీన్ థెరపీలు చాలా ఖరీదైనవి కావడంతో, సాధారణ రోగులకు, ముఖ్యంగా మన దేశంలో పేద కుటుంబాలకు అందుబాటులో ఉండటం లేదు. అయితే, ఈ తొలి విజయంతో, భవిష్యత్తులో ఈ థెరపీలు మరింత సులభంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయవంతమైన చికిత్స అరుదైన వ్యాధులతో (Rare Diseases) పోరాడుతున్న వేలాది మంది బాధితులకు పెద్ద ఊరటగా నిలవనుంది.

 

ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : genetic-problems genetic-issues genetic-factors genetic-reasons gene-therapy hunter-syndrome-gene-therapy hunter-syndrome-treatment hunter-syndrome-cure-news new-treatment-for-hunter-syndrome
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com