క్యాన్సర్ బాధితులు ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
సాక్షి లైఫ్ : క్యాన్సర్ రోగులు వ్యాయామం ప్రారంభించే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. వారి ఆరోగ్య పరిస్థితి, తీసు కుంటున్న చికిత్స ఆధారంగా వైద్యులు తగిన సూచనలు ఇస్తారు. తేలికపాటి వ్యాయామాలు: ప్రారంభంలో రోజుకు 10-15 నిమిషాల నడకతో మొదలుపెట్టాలి.యోగా, శ్వాస వ్యాయామాలు: ఇవి శారీరకంగా, మానసికంగా బలాన్ని ఇస్తాయి. బలోపేతం చేసే వ్యాయామాలు: బరువులు ఎత్తడం, బాడీవెయిట్ వ్యాయామాలు (వైద్యుల పర్యవేక్షణలో) కండరాలను బలోపేతం చేస్తాయి.
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT): చికిత్స పూర్తయిన తర్వాత డాక్టర్ల సూచనల మేరకు, శక్తిని బట్టి HIIT వంటి తీవ్రమైన వ్యాయామాలను కూడా ప్రయత్నించవచ్చు. వ్యాయామం కేవలం శరీరాన్ని మాత్రమే కాకుండా, మనసును కూడా బలోపేతం చేస్తుందని, సరైన ఆహారం, జీవనశైలి మార్పులతో పాటు వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం వల్ల క్యాన్సర్ ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని వైద్యనిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
