బెస్ట్ రైస్ : ఆరోగ్యానికి ఏ బియ్యం మంచిది అంటే..?
సాక్షి లైఫ్ : తెల్ల బియ్యానికి ప్రత్యామ్నాయంగా అనేక ఆరోగ్యకరమైన బియ్యం రకాలు అందుబాటులో ఉన్నాయి.. అటువంటివాటిలో బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్,రెడ్ రైస్, వైల్డ్ రైస్, బాంబూ రైస్, వంటివి ఉన్నాయి. బ్రౌన్ రైస్ (ముడి బియ్యం): పాలిష్ పట్టని బ్రౌన్ రైస్ లో ఫైబర్, పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
బ్లాక్ రైస్ (నల్ల బియ్యం): బ్లాక్ రైస్ లో అత్యధికంగా యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా ఆంథోసైనిన్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ప్రోటీన్, ఫైబర్ కూడా అధికంగా ఉంటాయి. రెడ్ రైస్ (ఎర్ర బియ్యం): ఎర్ర బియ్యంలో ఫైబర్, ప్రోటీన్, ఫ్లావనాయిడ్ యాంటీఆక్సిడెంట్లు దండిగా ఉంటాయి. ఇవి శరీరంలోని వాపును తగ్గించి, గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహం రిస్క్ ను తగ్గిస్తాయి.
వైల్డ్ రైస్ (అటవీ బియ్యం): తెల్ల బియ్యంతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా ఫైబర్, అధిక ప్రోటీన్ వైల్డ్ రైస్ లో లభిస్తాయి. ఇన్సులిన్ నిరోధకత, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. బాస్మతి రైస్ : సాధారణ తెల్ల బియ్యంతో పోలిస్తే బాస్మతి బియ్యం తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఇవి మితంగా తీసుకుంటే మంచిది. వెదురు బియ్యం (బాంబూ రైస్): వెదురు మొక్కల నుంచి లభించే ఈ బియ్యం గ్రీన్ కలర్ లో ఉంటుంది. తక్కువ గ్లైసెమిక్ సూచిక, అధిక పోషకాలు, ఫైబర్ కలిగి మధుమేహులకు మంచిది.
ఇది కూడా చదవండి.. రాత్రి భోజనం తర్వాత నడిస్తే.. ప్రయోజనాలివే..
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి..ప్రోటీన్ లోపంవల్ల తలెత్తే 6 అనారోగ్య సమస్యలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
