రక్త సంబంధిత వ్యాధి : హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?  

షేర్ చేయండి:
రక్త సంబంధిత వ్యాధి : హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?  

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వివిధ అనారోగ్యాలతో పోరాడు తున్నారు. వారిలో చాలా మంది బ్లడ్ రిలేటెడ్  ప్రాబ్లమ్స్ ను ఎదుర్కొంటూ ఉన్నారు. రక్త సంబంధిత వ్యాధులలో ప్రధానమైనది హిమోఫిలియా వ్యాధి ఒకటి. ఈ వ్యాధి బారినపడి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మిలియన్ల మంది చనిపోతున్నారు. ఇంకొందరిని ఈ వ్యాధి తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ సమస్యకు సరైన సమయంలో సరైన చికిత్స తీసుకోకపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం. హిమోఫిలియా గురించి అవగాహన చాలా అవసరమని చెబుతున్నారు వైద్యనిపుణులు. 

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

 హిమోఫిలియా..?   

హిమోఫిలియా అంటే అరుదైన రక్త సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వ్యక్తులలో రక్తం గడ్డకట్టదు. ఎందుకంటే రక్తంలో గడ్డకట్టే ప్రోటీన్లు లేకపోవడం కారణంగా ఇలా జరుగుతుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) చెబుతోంది.
 
 చిన్న గాయమైనా..  

ఈ వ్యాధి ఉన్నవాళ్లు ఎలాంటి గాయాలు, దెబ్బలు, ప్రమాదాలు తగల కుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్లకు చిన్న గాయమైనా  రక్తం కారుతూ ఉంటుంది. ఈ వ్యాధి శరీరం లోపల రక్తస్రావం కలిగిస్తుంది. హీమోఫిలియా వల్ల మోకాళ్లు, చీలమండలు, మోచేతులలో బ్లీడింగ్ అవ్వొచ్చు. శరీరంలోపల బ్లీడింగ్ అవ్వడం వల్ల బాడీ లోని అవయవాలు, కణజాలాలు  దెబ్బతింటాయి. ఇలా జరిగితే మనిషి ప్రాణాలకే ప్రమాదం జరగవచ్చు. కనుక ఈ వ్యాధి వచ్చినవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

హిమోఫిలియాకు కారణాలు ఏమిటంటే..?

హిమోఫిలియా అనేది జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్లనే ఎక్కువగా వస్తుంది. 40 ఏళ్లు పైబడినవారు, వృద్ధులను ఈ వ్యాధి తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. హిమోఫిలియా వచ్చిన వారిలో జన్యువులలో మార్పులు జరుగుతాయి. ఫలితంగా రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రోటీన్ అందుబాటులో ఉండదు. ఒకవేళ హిమోఫిలియా కుటుంబంలో ఎవరికైనా ఉంటే, ఆయా ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ మహమ్మారి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. హిమోఫిలియాను ముందుగా స్క్రీనింగ్ ద్వారా గుర్తించి చికిత్స చేస్తే కొంతమేర కంట్రోల్ అవుతుంది.

  లక్షణాలు ఎలా ఉంటాయి..? 

బ్రెయిన్ లో బ్లీడింగ్ అవ్వడం 
అప్పుడప్పుడు వాంతులు అవ్వడం 
చాలా కాలంగా తలనొప్పిగా అనిపించడం
బలహీనంగా అనిపించడం
బ్లీడింగ్ అవుతుంది. 
మలంలో కానీ మూత్రంలో కానీ రక్తం
కీళ్ల వాపు, నొప్పి 
ముక్కు నుంచి బ్లీడింగ్ అవ్వడం

  

ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..? 

ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.