BP : లో బీపీ రావడానికి ప్రధాన కారణాలు..?

షేర్ చేయండి:
BP : లో బీపీ రావడానికి ప్రధాన కారణాలు..?

సాక్షి లైఫ్ : లోబీపీ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. "డీ" హైడ్రేష‌న్‌, గుండె కొట్టుకునే వేగం త‌గ్గ‌డం, గుండెలో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం, విట‌మిన్ బీ12 లోపం, అడ్రిన‌లైన్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం, సెప్టిసీమియా, వేసో వ్యాగ‌ల్ రియాక్ష‌న్‌లు, పోస్టుర‌ల్ హైపో టెన్ష‌న్, హై బీపీ కోసం మందులు వేసుకోవ‌డం, ఆల్కహాల్‌ ఎక్కువగా తాగడం, డ్రగ్స్‌ వాడకం కారణంగా లోబీపీ వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 

 జాగ్రత్తలు.. 

హైపోటెన్షన్ అనేది తీవ్రమైన సమస్య. అయితే దానిని నుంచి బయటపడటం పెద్ద కష్టమేమి కాదు. తీసుకునే ఆహారం, జీవనశైలిని మార్చుకోవటం ద్వారా, లో బీపీ సమస్యను సులభంగా నివారించవచ్చు. అందుకోసం ఏం చేయాలంటే..?  

-తగినంత నీరు తాగాలి. 
-ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. 
-క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
-ఆల్కహాల్, పొగత్రాగడం వంటి అలవాట్లు ఉంటే మానుకోండి. 
-మీరు ఏదైనా మందులు తీసుకుంటుంటే, వాటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ గురించి మీ డాక్టర్‌ ను సంప్రదించండి. 
-ఆహారంలో తగినంతగా ఉప్పు తీసుకొండి. 
-తక్కువగా ఎక్కువసార్లు తినాలి. 

లో బీపీ వస్తే ఏం చేయాలి..?

రక్తపోటులో ఆకస్మిక తగ్గుదలకు సరైన చికిత్స అవసరం. ఆ సమయంలో స్వీయ చికిత్స కంటే ఆసుపత్రికి వెళ్లడం మంచిది. ఒక గంటలోపు ఆసుపత్రికి వెళ్ళడం వల్ల ప్రమాదకర పరిస్థితులను నివారించవచ్చు. 

అక్కడ లోబీపీకి కారణాన్ని గుర్తించి చికిత్స అందిస్తారు. మనం పైన చెప్పుకున్నట్టుగా... లోబీపీ లక్షణాలు కనిపించగానే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి. వారి సలహా మేరకు మీ జీవనశైలిని సరిచేసుకోవాలి. తగిన పోషకాహారం, తగినంత నిద్ర, తేలికపాటి వ్యాయామాలు తప్పనిసరిగా మీ దినచర్యలో చేర్చుకోవాలి.  

సైంధవ లవణం.. 

లోబీపీతో కళ్లు తిరిగి పడిపోవడం, మైకం కమ్మినప్పుడు వెంటనే ఒక గ్లాస్‌ నీటిలో అర టీస్పూన్‌ సైంధవ లవణం కలుపుకొని తాగితే బీపీ వెంటనే నార్మల్‌ అవుతుంది. ఇది టేస్ట్‌లో కొంచెం ఉప్పగా, తీపిగా ఉంటుంది.సైంధవ లవణంలో పొటాషియం అధికంగా ఉంటుంది. 

ఇది బీపీని కంట్లోల్‌ చేసి, నార్మల్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. మన శరీరానికి కావాల్సిన  కాల్షియం, కాపర్‌, ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌, పొటాషియం, సల్ఫర్‌, జింక్‌, అయోడిన్‌, ఆక్సిజన్‌ వంటి అనేక పోషక విలువలు సైంధవ లవణంలో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..ఎలాంటి ఆహారం ద్వారా ఆయుష్షు ను పెంచుకోవచ్చు..

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే 

 
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.