సాక్షి లైఫ్ : ఆయుష్షును పెంచేందుకు సరైన ఆహారం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన, పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి, అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. దీనివల్ల ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చు. వీటితో పాటు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, ఉప్పు అధికంగా ఉండే పదార్థాలను తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం కూడా చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరిపడా నిద్రపోవడం, ఒత్తిడి లేకుండా ఉండటం వంటివి కూడా దీర్ఘాయువుకు దోహదం చేస్తాయి.
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
మనం తీసుకునే ఆహారం కారణంగానే పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య సంరక్షణలో ఆహారం పాత్ర చాలా కీలకం. ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా మన జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే వీలుంటుంది.
అదేవిధంగా జీవిత కాలాన్ని కూడా పెంచుకోవచ్చు అంటున్నాయి పరిశోధనలు. కొన్ని రకాల ఆహారాలను నిత్యం తీసుకోవడం ద్వారా జీవిత కాలాన్ని పురుషుల్లో 13 ఏళ్ల వరకు.. మహిళల్లో 10 సంవత్సరాల వరకు పెంచుకోవచ్చని అంటున్నారు. ఆయుష్షును పెంచుకునే ఆహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!
జీవిత కాలాన్నిపెంచుకోవచ్చు..
పీఎల్‌ఓఎస్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం, ఒక మహిళ తన 20 ఏళ్ల వయస్సులో మంచి ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తే.. తన జీవిత కాలాన్ని10 సంవత్సరాలు పెంచుకోవచ్చు. అలాగే ఒక పురుషుడు తన జీవితానికి 13 సంవత్సరాలు పొడింగించు కోవచ్చు.
ఆరోగ్యకరమైన ఆహారం ..
ఆరోగ్యకరమైన ఆహారం వృద్ధుల జీవిత కాలాన్ని కూడా పొడిగిస్తుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. నిత్యం తీసుకునే ఆహారంలో పచ్చి ఆకుకూరలు, కూరగాయలు క్రమం తప్పకుండా తీసుకుంటే 80 ఏళ్ల వృద్ధుడు కూడా ప్రయోజనం పొందవచ్చని వారు సూచిస్తున్నారు.
ఈ వయస్సులో ఆహారంలో మార్పుతో వృద్ధులు తమ జీవిత కాలాన్ని మూడున్నర సంవత్సరాల వరకు పెంచుకోవచ్చునని వారు చెబుతున్నారు.
సమతుల ఆహారం..
సమతుల ఆహారం దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని, సడెన్ డెత్ ప్రమాదాలను తగ్గిస్తుంది. దీర్ఘాయువు కోసం అత్యంత ప్రయోజనకరమైన ఆహారాలైన చిక్కుళ్ళు.. ముఖ్యంగా బీన్స్, బఠానీలు వంటి కాయధాన్యాలు తీసుకోవాలి.
ఆకు కూరలు..
తృణధాన్యాలే కాకుండా వాల్ నట్స్, బాదం, పిస్తాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కూడా అనేక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. ఆకు కూరలు, ధాన్యపు ఆహారాలు మనల్ని ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
"దీర్ఘాయువు-ఆహారం" పాత్ర అనే అంశంపై నార్వేకు చెందిన పరిశోధకులు ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. దీని కోసం ఒక నమూనాను తయారు చేశారు. రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం ద్వారా పురుషులు, స్త్రీల జీవితకాలంపై ఎలాంటి మార్పులు ఉన్నాయనే అంశాలను పరిశీలించారు.
పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు..
అలాగే, సమతుల ఆహారం తీసుకున్న వారిలో ఎక్కువగా వారి మెనూలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు చేర్చుకున్నారు. దీంతో వారు మిగిలిన వాళ్లతో పోలిస్తే యాక్టివ్ గా కనిపించారు. జీవిత కాలాన్ని పెంచుకునేందుకు నిత్యం పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల మరింత హెల్తీగా ఉండొచ్చని పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో మాంసాహారానికి బదులు శాఖాహారం బెస్ట్ అని పరిశోధకులు తేల్చారు.
బెస్ట్ ఫుడ్స్ ..
ఉత్తమమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఆయుష్షు పెంచుకోవడంతోపాటు, పలు రోగాల నుంచి దూరంగా ఉండొచ్చని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..అధిక రక్తపోటుకు బ్రెయిన్ స్ట్రోక్ కు లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి..Menopause : మెనో పాజ్ వల్ల కూడా డిప్రెషన్ కు గురవుతారా..?
ఇది కూడా చదవండి..For health : కుంకుమ పువ్వు"టీ"తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com