Calories : రోజుకు మన శరీరానికి ఎన్ని క్యాలరీలు అవసరం..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వ్యక్తి శరీర తత్వం, వయస్సు, లింగం, రోజువారీ శారీరక శ్రమను బట్టి క్యాలరీల అవసరం మారుతూ ఉంటుంది. సాధారణంగా, మధ్య వయస్సులో ఉన్న ఒక మగవారికి రోజుకు సగటున 2వేల నుంచి 2,500 క్యాలరీలు అవసరమవుతాయి. అదే మధ్య వయస్సులో ఉన్న ఒక మహిళకు 1,800 నుంచి 2,200 క్యాలరీలు సరిపోతాయి. ఎక్కువ శారీరక శ్రమ చేసేవారికి లేదా క్రీడాకారులకు ఈ క్యాలరీల అవసరం ఇంకా ఎక్కువగా ఉంటుంది.

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి.. లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఆహార నియమాలు ఎలా ఉండాలి..?

సమతుల్య ఆహారం: మనం తినే ఆహారంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. పండ్లు, కూరగాయలు: రోజులో కనీసం 5 రకాల పండ్లు, కూరగాయలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి.తక్కువ నూనె, ఉప్పు: ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక నూనె, ఉప్పు ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి గుండె సంబంధిత సమస్యలకు దారి తీయవచ్చు. నీరు పుష్కలంగా తాగడం: శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. ఇది జీవక్రియలకు చాలా ముఖ్యం.

డైటీషియన్స్ ఏమంటున్నారంటే..? 

 అతిగా తినడం, అసలు తినకుండా ఉండటం రెండూ అనారోగ్యకరమే. ఎంత ఆహారం తీసుకుంటున్నామో, అందులో ఎలాంటి పోషకాలు ఉన్నాయో గమనించుకోవాలి. ప్రతి వ్యక్తి తమ శరీరానికి తగినట్లుగా ఆహార నియమాలను అనుసరించాలి. ఇందుకోసం డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది.

కేవలం క్యాలరీలను మాత్రమే కాకుండా, ఆహారం నుండి శరీరానికి లభించే పోషకాలపై దృష్టి పెట్టాలి. బరువు తగ్గాలనుకునేవారు లేదా పెరగాలనుకునేవారు క్యాలరీల లెక్కపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మనం ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండగలుగుతామని  డైటీషియన్స్ చెబుతున్నారు.

 ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.