కోడి గుడ్లు తినడం వల్ల బర్డ్ ఫ్లూ వస్తుందా..?  

షేర్ చేయండి:
కోడి గుడ్లు తినడం వల్ల బర్డ్ ఫ్లూ వస్తుందా..?  

సాక్షి లైఫ్ : బర్డ్ ఫ్లూ సోకిన కోడి మాంసం, గుడ్లు తినడం వల్ల ఈ వ్యాధి సోకుతుందే మోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాధి ఏవియన్ ఇన్‌ఫ్లూఎంజా అనే వైరస్ ద్వారా వస్తుంది. ఇది పక్షులకే కాకుండా మనుషులకు, ఇతర జంతువులకు కూడా సోకే అవకాశముంది. అందువల్ల, బర్డ్ ఫ్లూ సోకిన కోడి మాంసం తినడం సురక్షితమా? కాదా..? అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతూ ఉన్నాయి.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

బర్డ్ ఫ్లూ సోకిన కోడి మాంసం తినడం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, కోడి మాంసాన్ని బాగా ఉడికించి తినడం ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చని, ఒకవేళ కోడి గుడ్లు లేదా మాంసం సరిగా ఉడికించకపోతే వైరస్ సోకే అవకాశాలు అధికంగా ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాబట్టి చికెన్ కర్రీ చేస్తున్నప్పుడు శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. పచ్చి చికెన్‌ను శుభ్రం చేసిన తరువాత చేతులు ,వంటపాత్రలను కూడా తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. అలాగే గుడ్లు వండేటప్పుడు కూడా ఈ జాగ్రత్తలను పాటించాలని వారు చెబుతున్నారు. అనారోగ్యంతో ఉన్న పక్షులు లేదా కోళ్లను ముట్టుకోకూడదని, వీటి నుంచి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

 బర్డ్ ఫ్లూ వైరస్‌ సోకిన రెండు నుంచి 8 రోజుల అనంతరం లక్షణాలు మెల్లగా ఆయా వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతాయి. మొదటగా శ్వాసకోశ సంబంధిత లక్షణాలు తలెత్తేఅవకాశం ఉంది. దీంతోపాటు జలుబు, ముక్కు మూసుకుపోవడం,జలుబు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు ఉంటాయి.

కొందరికి తలనొప్పి, జ్వరం, అలసట, కండరాల నొప్పులు, వికారం, వాంతులు, విరేచనాలు వంటి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్‌ తీవ్రత పెరిగినట్లయితే కొన్ని సందర్భాల్లో అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. న్యుమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించవచ్చు.

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..ఆఫ్రికాలో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.