ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడిస్తే కొలెస్ట్రాల్ ను నియంత్రించ వచ్చా..?
సాక్షి లైఫ్ : కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే ఎలా తగ్గించుకోవాలి..? కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటంటే..? ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించండి: ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తినండి, ట్రాన్స్ ఫ్యాట్లను నివారించండి. ధూమపానం, మద్యం మానుకోండి : ఈ రెండు అలవాట్లు రక్త నాళాలను దెబ్బతీస్తాయి.
ఇది కూడా చదవండి..కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి..? వాటికి కారణమేమిటి..?
ఇది కూడా చదవండి..బ్రౌన్ రైస్ తినడంవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు..
నీరు పుష్కలంగా తాగండి : నీరు శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. డాక్టర్ ను సంప్రదించి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోండి: మీ కొలెస్ట్రాల్ స్థాయిలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ వైద్యులు అందించిన మందులు వాడడం ద్వారా సులువుగా ఆయా సమస్య నుంచి బయట పడొచ్చు.
వ్యాయామం : ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవడం లేదా యోగా చేయడం.
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవడం వల్ల కొలెస్ట్రాల్ ను సులువుగా నియంత్రించడానికి వీలవుతుంది. వ్యాయామం, ముఖ్యంగా నడక, హార్ట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ (ఎల్ డి ఎల్) స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (హెచ్ డి ఎల్) స్థాయిలను పెంచుతుంది. ప్రతి రోజూ నడక వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం సాధ్య మవుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు
ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
