సాక్షి లైఫ్ : చియా గింజలు లేదా (ఫ్లాక్స్ సీడ్స్)అవిసె గింజలు.. ఈ రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఈ రెండిటిలో ఏది ఉత్తమమైన ఫలితాలు ఉన్నాయన్నప్పుడు గందరగోళానికి గురవ్వాల్సివస్తుంది. ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి అనేక అంశాలను పోలిస్తే ఈ రెండు విత్తనాల (చియా సీడ్స్ వర్సెస్ ఫ్లాక్స్ సీడ్స్) మధ్య తేడాను తెలుసుకోవడం ద్వారా ఏది ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయనేది గుర్తించవచ్చు..
ఇది కూడా చదవండి.. బ్రకోలీని ఇలా తింటే10 రెట్లు ప్రయోజనాలు పొందవచ్చు..
ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
చియా విత్తనాలు vs అవిసె గింజలను ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించే సూపర్‌ఫుడ్స్ గా పరిగణిస్తారు. ఈ గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలుంటాయి. అయితే, ఈ రెండు విత్తనాల మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. అవేంటంటే..?
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్..
ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. చియా గింజలు, అవిసె గింజల్లోనూ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అయినప్పటికీ, చియా గింజలలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA), ఒక రకమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఫ్లాక్స్ సీడ్స్‌లో కూడా ఉంటుంది, అయితే చియా గింజలతో పోలిస్తే ఇది తక్కువ.
ఫైబర్..
మెరుగైన జీర్ణక్రియకు ఫైబర్ చాలా ముఖ్యం. ఇది చియా విత్తనాలు ,అవిసె గింజలు రెండింటిలోనూ ఉంటుంది. అయినప్పటికీ, చియా విత్తనాలు అవిసె గింజల కంటే ఎక్కువ కరిగే ఫైబర్ కలిగి ఉంటాయి. ఇది జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా చాలా సహాయపడుతుంది.
ప్రోటీన్..
కణాలను బాగు చేయడంలో ప్రోటీన్ పాత్ర చాలా కీలకమైనది. ఇది చియా విత్తనాలు, అవిసె గింజలు రెండింటిలోనూ సమృద్ధిగా ఉంటుంది. అయితే ఇది అవిసె గింజలలో కంటే చియా గింజలలో ఎక్కువగా కనిపిస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు..
శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడడంలో యాంటీ ఆక్సిడెంట్లు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. ఇవి చియా విత్తనాలు మరియు అవిసె గింజలు రెండింటిలోనూ కనిపిస్తాయి, అయితే అవిసె గింజలతో పోలిస్తే చియా గింజలలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి.
రుచి..
చియా విత్తనాలు, అవిసె గింజలు రెండూ రుచి, ఆకృతిలో తేడాలు ఉంటాయి. చియా విత్తనాలు వాటి స్వంత ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. అయితే అవిసె గింజలు కొద్దిగా చేదుగా ఉంటాయి. ఇది కాకుండా, చియా విత్తనాలను నీటిలో నానబెట్టినప్పుడు, అవి జెల్లీ లా ఉంటాయి, అయితే అవిసె గింజలు మరింత క్రంచీగా ఉంటాయి.
ఏవి ఎక్కువ ప్రయోజనకరం అంటే..?
చియా విత్తనాలు, అవిసె గింజలు రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చియా విత్తనాలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, కరిగే ఫైబర్, ప్రోటీన్ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అదే సమయంలో, ఈ పోషకాలన్నీ అవిసె గింజలలో కూడా మంచి పరిమాణంలో ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఏ విత్తనాలు ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరం అన్నప్పుడు.. అది మీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండు విత్తనాలను తినాలనుకుంటే, ఎటువంటి సందేహం లేకుండా వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com