Traditional Indian Snacks : వీటికి బదులు ‘దేశీ’ చిరుతిళ్లు తింటే.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సాయంత్రం కాగానే వేడి వేడి టీతో పాటు ఏవైనా బిస్కెట్లు తినడం మనలో చాలామందికి అలవాటు. ఆకలిగా అనిపించిన వెంటనే ప్యాకెట్ విప్పి రెండు బిస్కెట్లు నోట్లో వేసుకుంటాం. అయితే, ప్రతిరోజూ ఒకే రకమైన ప్యాకేజ్డ్ స్నాక్స్ తినే బదులు, ఇంట్లోనే సులభంగా చేసుకోగలిగే రుచికరమైన, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్‌లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!

 

బిస్కెట్లకు బదులు దేశీ స్నాక్స్ ఎందుకు..?

బజార్లో దొరికే బిస్కెట్లు తిన్నప్పుడు కాసేపు ఆకలి తీరినట్లు అనిపించినా.. వాటిలోని మైదా, చక్కెర వల్ల కొద్దిసేపటికే మళ్లీ ఏదైనా తినాలనిపిస్తుంది. అదే మన ఇంట్లో చేసుకునే సంప్రదాయ చిరుతిళ్లు అయితే, కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలు, ఫైబర్ పుష్కలంగా అందుతాయి. సాయంత్రం వేళ టీ లేదా కాఫీతో పాటు తీసుకోవడానికి అనువైన ఆరోగ్యకరమైన చిరుతిళ్లు ఇప్పుడు తెలుసుకుందాం..

మీ ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన స్నాక్స్..  

1. వేయించిన శనగలు (పుట్నాలు).. 

సాయంత్రం వేళ ఆకలిని తీర్చుకోవడానికి ఇదొక అద్భుతమైన ఎంపిక. వీటిని తినడం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లవచ్చు. టీతో పాటు వీటిని తింటే ఆ రుచే వేరు.

2. మఖానా (తామర గింజలు)..

 బరువు తగ్గాలనుకునేవారికి ఇదొక బెస్ట్ స్నాక్. మఖానా చాలా తేలికగా, కరకరలాడుతూ ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసి, దానికి కాస్త ఉప్పు, మిరియాల పొడి లేదా మసాలా అద్ది దోరగా వేయించుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

3. ఢోక్లా..

 మీకు ఏదైనా తేలికపాటి ఆహారం తినాలనిపిస్తే, శనగపిండితో చేసే 'ఢోక్లా' మంచి ఆప్షన్. ఇది నూనెలో వేయించినది కాదు, ఆవిరి మీద ఉడికించినది కాబట్టి జీర్ణం అవ్వడం సులభం. బరువు పెరగమన్న భయం కూడా ఉండదు.

4. అటుకులు (పోహా)..

ఉదయం అల్పాహారంగానే కాకుండా, సాయంత్రం స్నాక్‌గా కూడా అటుకులను తీసుకోవచ్చు. దీనికి పల్లీలు, పచ్చి బఠానీలు, నచ్చిన కూరగాయల ముక్కలు జోడిస్తే రుచితో పాటు పోషక విలువలు కూడా పెరుగుతాయి.

5. మొలకల చాట్..

 పెసలు లేదా శనగల మొలకలతో చేసే చాట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ మొలకలకు సన్నగా తరిగిన టమాటా, ఉల్లిపాయ, కీరా దోస, కొత్తిమీర, కాస్త నిమ్మరసం కలుపుకుని తింటే విటమిన్లతో పాటు అద్భుతమైన రుచి మీ సొంతం.

6. పెసరట్టు (మూంగ్ దాల్ చీలా)..

 సాయంత్రం వేళ వేడిగా, కడుపు నిండేలా ఏదైనా తినాలనుకుంటే పెసరట్టు లేదా పెసరపిండితో చేసే చీలా చక్కటి ఎంపిక. దీనికి కాస్త పుదీనా లేదా కొత్తిమీర చట్నీ జతచేసుకుని తింటే ఆకలి పూర్తిగా తీరుతుంది.

7. ఇడ్లీ..

 ఇడ్లీ ఎప్పుడూ సులభంగా జీర్ణమయ్యే ఆహారం. ఉదయం మిగిలిన ఇడ్లీలను సాయంత్రం స్నాక్‌గా మార్చుకోవచ్చు. సాంబార్ లేదా కొబ్బరి చట్నీతో పాటు తినవచ్చు. లేదా ఇడ్లీలను చిన్న ముక్కలుగా కోసి కొద్దిగా నూనెలో తాలింపు వేసుకుని ఫ్రైడ్ ఇడ్లీ కూడా పిల్లలకు పెట్టొచ్చు.

8. డ్రై ఫ్రూట్స్, వేయించిన పల్లీలు..

 పనులు హడావుడిలో ఉండి, ఏమీ చేసుకునే సమయం లేనప్పుడు.. గుప్పెడు బాదం, వాల్‌నట్స్, కిస్‌మిస్ లేదా వేయించిన పల్లీలు తినవచ్చు. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా, రాత్రి భోజనం వరకు ఆకలిని నియంత్రిస్తాయి.

రోజూ టీతో పాటు ప్యాకెట్ బిస్కెట్లు తినే అలవాటు ఉంటే, అప్పుడప్పుడు ఈ దేశీ స్నాక్స్‌ను మీ డైట్‌లో చేర్చుకోండి. ఇవి మీ జిహ్వ చాపల్యాన్ని తీర్చడమే కాకుండా, మీ కుటుంబ ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. బజారులో కొనే వాటికంటే ఇంట్లో తయారు చేసుకునే వంటకాలే ఎప్పటికీ సురక్షితం.

 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.