Cycle Syncing : సైకిల్ సింకింగ్ అంటే ఏమిటి..? దీనిపై తాజా పరిశోధనలు ఏమంటున్నాయి..?
సాక్షి లైఫ్ : ప్రస్తుత తరం మహిళల్లో 'సైకిల్ సింకింగ్' (Cycle Syncing) అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. నెలసరి చక్రంలోని వివిధ దశలకు అనుగుణంగా వ్యాయామాలను, ఆహారపు అలవాట్లను, జీవనశైలి అలవాట్లను మార్చుకోవడాన్నే 'సైకిల్ సింకింగ్'అని అంటారు. ఉదాహరణకు, పీరియడ్స్ సమయంలో నడక వంటి తేలికపాటి వ్యాయామాలు, ఈస్ట్రోజెన్ పెరిగే దశలో కఠినమైన వర్కవుట్లు చేయడం శ్రేయస్కరమని చాలామంది నమ్ముతుంటారు. అయితే, దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
హార్మోన్ల ప్రభావం అంతగా ఉండదా..?
శరీరంలోని హార్మోన్ల మార్పుల వల్ల బలం, ఓర్పు (Endurance), కోలుకునే సామర్థ్యం మారుతాయని భావించి చాలామంది తమ ఫిట్‌నెస్ ప్లాన్‌ను మార్చుకుంటారు. కానీ, దీనికి సంబంధించి ఎటువంటి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవని స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణురాలు డాక్టర్ మెగాన్ రోచీ పేర్కొంటున్నారు. వ్యాయామంపై కేవలం హార్మోన్లు మాత్రమే కాకుండా వందలాది ఇతర అంశాలు ప్రభావం చూపుతాయని ఆమె వివరిస్తున్నారు.
ఇతర అంశాలే ముఖ్యం..
వ్యాయామం చేసే సమయంలో మీ శక్తి సామర్థ్యాలను కేవలం పీరియడ్స్ సైకిల్ మాత్రమే నిర్ణయించదు.రాత్రిపూట సరైన నిద్ర లేకపోవడం. మానసిక ఒత్తిడి.. ఆఫీసు పనులు లేదా వ్యక్తిగత కారణాల వల్ల కలిగే స్ట్రెస్. జీవనశైలి.. మీరు తీసుకునే ఆహారం, ఇతర అలవాట్లు. కేవలం నెలసరి చక్రాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే, కీలకమైన అంశాలను విస్మరించే ప్రమాదం ఉందని డాక్టర్ రోచీ హెచ్చరిస్తున్నారు.
ప్రతిదీ లెక్క ప్రకారం జరగాలనే..
శరీరానికి కదలిక ముఖ్యం కానీ, ప్రతిదీ లెక్క ప్రకారం జరగాలనే నిబంధన ఏమీ లేదు. ఒకవేళ సైకిల్ సింకింగ్ వల్ల మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయగలుగుతుంటే అది మంచిదే. కానీ, "ఈ దశలో ఈ వ్యాయామమే చేయాలి" అని అతిగా ఆలోచించి ఒత్తిడికి గురైతే అది మీ పురోగతిని దెబ్బతీస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చాలా అవసరం. అటువంటి వాటిలో నడక, వెయిట్ లిఫ్టింగ్ లేదా క్రీడలు ఏవైనా సరే.. ఇష్టంగా, క్రమం తప్పకుండా చేయడంపైనే దృష్టి సారించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
