సాక్షి లైఫ్ : డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు లేదా శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించలేనప్పుడు తలెత్తుతుంది. ఇన్సులిన్ రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించే హార్మోన్. హైపర్గ్లైకేమియా లేదా బ్లడ్ లో గ్లూకోజ్ పెరగడం అని అంటారు.
-మధుమేహం ప్రభావం కాలక్రమేణా పలురకాలుగా శరీరంపై పడుతుంది. ముఖ్యంగా నరాలు, రక్త నాళాలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది.
-2014 సంవత్సరంలో 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిలో 8.5శాతం మంది మధుమేహగ్రస్తులున్నారు.
డబ్ల్యూ హెచ్ ఓ లెక్కల ప్రకారం.. 2019లో మధుమేహం సమస్యలతో 15లక్షల మందిచనిపోయారు.
-70 సంవత్సరాలు నిండనివారే మధుమేహం కారణంగా 48శాతం మంది కన్నుమూశారు.
-4లక్షల 60వేల మంది షుగర్ వచ్చిన వారిలో కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తడంవల్ల మరణించారు.
20 శాతం మంది డయాబెటిస్ ఉన్నవారిలో గుండె సంబంధిత సమస్యల కారణంగా మృతి చెందుతున్నారు.
-2000 - 2019 సంవత్సరాల మధ్య షుగర్ ఉన్నవారిలో మరణాల రేటులో 3శాతం పెరుగుదల కనిపించింది.
-దిగువ మధ్య-ఆదాయ దేశాలలో మధుమేహం కారణంగా మరణాల రేటు 13శాతంపెరిగింది.
2000 - 2019మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 30 నుంచి 70 ఏళ్లలోపు వయసున్న వారిలోనే ఎక్కువమంది డయాబెటీస్ కారణంగా చనిపోయారు.
-గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు వంటి వాటితో మరణించే వారి సంఖ్య 22శాతం తగ్గింది.
డయాబెటీస్ గురించిన వాస్తవాలు..
మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య 1980లో ప్రపంచవ్యాప్తంగా 10కోట్ల ఎనభై లక్షల మంది ఉండగా, వారి సంఖ్య 2014 నాటికి 42కోట్ల 20 లక్షల మందికి మిలియన్లకు పెరిగింది. అధిక-ఆదాయ దేశాల కంటే తక్కువ, మధ్య-ఆదాయ దేశాలలోనే షుగర్ వ్యాధి వేగంగా పెరుగుతోంది.
అంధత్వం, మూత్రపిండాల వైఫల్యం, గుండెపోటు, పక్షవాతం వంటి వాటికి మధుమేహ సమస్య ప్రధాన కారణమని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. 2000 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం వరకు మధుమేహంతో బాధపడుతున్నవారిలో మరణాల రేటు 3శాతం పెరిగింది.
2019లో మధుమేహం కారణంగా మూత్రపిండాల వ్యాధి కారణంగా 20లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.
ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ, శరీర బరువును తగ్గించుకోవడం , పొగాకు వాడకాన్ని నివారించడం వల్ల మధుమేహం రాకుండా జాగ్రత్త పడొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
డయాబెటిస్‌కు నివారణ..
సరైన ఆహారం, శారీరక శ్రమ, ఔషధాల వాడకం, ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేయించుకోవడంతోపాటు అందుకు తగిన సమస్యలను గుర్తించి చికిత్స చేయడం ద్వారా డయాబెటిస్ ను నివారించవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించ డానికి, జీవనశైలి ,ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీన్ని నియంత్రించడానికి, మీరు మీ ఆహారంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న వాటిని చేర్చుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్లు చెబుతున్నారు.
మధుమేహం.. లక్షణాలు..
మధుమేహ లక్షణాలు కొందరిలో అకస్మాత్తుగా సంభవిస్తాయి. టైప్ 2 డయాబెటిస్‌లో తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో ఈ లక్షణాలు గమనించడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు.
ఎక్కువగా ఆకలి వేయడం..
మూత్రానికి ఎక్కువ సార్లు వెళ్లాల్సి రావడం..
అలసటగా అనిపించడం..
వేగంగా బరువు తగ్గడం జరుగుతుంది..
డయాబెటీస్ ఉన్నవారిలో వచ్చే వ్యాధులు..
మధుమేహం పెరుగుతున్నవారిలో గుండె, కళ్ళు, మూత్రపిండాలు ,నరాలలోని రక్త నాళాలు దెబ్బ తినే ప్రమాదం ఉంది.
దీనికారణంగా గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
మధుమేహం ఉన్నవాళ్లలో కంటిలోని రక్తనాళాలు దెబ్బతినడం వల్ల దృష్టి సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి.
ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ సంఖ్య 2050 నాటికి 130 కోట్లు పెరగవచ్చని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఈ వ్యాధి నివారణకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com