Skin health : వర్షాకాలంలో మెరిసే చర్మం కోసం 5 'సూపర్ ఫుడ్స్'.. 

సాక్షి లైఫ్ : రుతుపవనాల (Monsoon) కాలం ఆహ్లాదకరంగా ఉంటుంది, కానీ మన చర్మానికి మాత్రం ఇది కష్టకాలం. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల మొటిమలు (Acne), చర్మపు దద్దుర్లు (Rashes), సెబమ్ ఉత్పత్తి (Sebum Production) పెరగడం వంటి సమస్యలు సర్వసాధారణం. అయితే, ఆయుర్వేదం ప్రకారం, చర్మాన్ని లోపలి నుండి శుభ్రపరచడం ద్వారా ఈ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.

జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి, రక్తంలోని మలినాలను తొలగించడం ద్వారా వర్షాకాలంలో మీ చర్మం ప్రకాశవంతంగా ఉండేందుకు సహాయపడే 5 అద్భుతమైన ఆయుర్వేద సూపర్ ఫుడ్స్ (Ayurvedic Superfoods) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 త్రిఫల (Triphala)..త్రిఫల అనేది ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమం. ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది, పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ సరిగా లేకపోతే చర్మ సమస్యలు వస్తాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. త్రిఫల మలబద్ధకాన్ని నివారించి, శరీరంలో ఉన్న విష పదార్థాలను (Toxins) తొలగించడంలో సహాయపడుతుంది.

ఎలా తీసుకోవాలి.. ఎప్పుడు తీసుకోవాలి..? : రాత్రి పడుకునే ముందు ఒక టీస్పూన్ త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవాలి.

 పసుపు (Turmeric)..పసుపును సహజ సిద్ధమైన యాంటీబయాటిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్న పదార్థంగా పరిగణిస్తారు. పసుపులో ఉండే కర్కుమిన్ (Curcumin) చర్మంలోని మంట (Inflammation) ఎర్రబడడాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా మొటిమల వల్ల వచ్చే వాపును తగ్గించి, త్వరగా నయం కావడానికి దోహదపడుతుంది.

ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి..? ప్రతిరోజూ ఉదయం పాలల్లో కొద్దిగా పసుపు కలిపి తాగవచ్చు లేదా తేనెతో కలిపి తీసుకోవచ్చు.

 వేప (Neem).. వేప అత్యుత్తమమైన రక్త శుద్ధి చేసే (Blood Purifier) పదార్థాలలో ఒకటి. ఇది చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. వేపలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. వర్షాకాలంలో తరచుగా వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లను (Fungal Infections) కూడా వేప నివారిస్తుంది.

ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి..? వేప ఆకుల పొడిని నీటితో కలిపి లేదా ఆయుర్వేద నిపుణుల సలహా మేరకు వేప గుళికల (Neem Capsules) రూపంలో తీసుకోవచ్చు.

అల్లం (Ginger).. అల్లం అగ్నిని (జీర్ణ శక్తి) పెంచడానికి సహాయ పడుతుంది. వర్షాకాలంలో జీర్ణ శక్తి మందగిస్తుంది. అల్లం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, మలినాలు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా, దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి.

ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి..? ప్రతిరోజూ అల్లం టీ తాగడం లేదా భోజనానికి ముందు అల్లం ముక్కలను కొద్దిగా ఉప్పుతో కలిపి తీసుకోవడం మంచిది.

 కొత్తిమీర (Coriander).. ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి..? కొత్తిమీర రక్తాన్ని శుద్ధి చేయడంలో హార్మోన్ల సమతుల్యత (Hormone Balance) లో సహాయపడుతుంది. చర్మ సహజ శీతలీకరణ ప్రభావాన్ని నిర్వహించడానికి కూడా ఇది ముఖ్యమైనది. మొటిమలు, బ్లాక్ హెడ్స్ (Blackheads) వంటి సమస్యలను తగ్గించడంలో కొత్తిమీర రసం బాగా పనిచేస్తుంది.

ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి..? కొత్తిమీర ఆకులను రసంలా తీసి ప్రతిరోజూ తాగవచ్చు. కొత్తిమీర, క్యారెట్, దోసకాయ వంటి వాటితో కలిపి జ్యూస్‌గా కూడా తీసుకోవచ్చు.

ఈ ఆయుర్వేద సూపర్ ఫుడ్స్‌ను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా, వర్షాకాలంలో కూడా మీ చర్మం కాంతివంతంగా, మొటిమలు లేకుండా మెరిసేలా చేసుకోవచ్చు. ఈ ఆహారం తీసుకునే ముందు ఆయుర్వేద నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : skin-disease skin-care-tips skin-problems healthy-skin skin-health skin-problem monsoons monsoons-season skin-infection monsoon-tips monsoon-health monsoon-health-care monsoon-season-health monsoon-seasonal-diseases superfoods traditional-superfoods
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com