బిస్కెట్లలో ఉండే ఇవి చాలా ప్రమాదకరమని మీకు తెలుసా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మీరు ఆరోగ్యంగా భావించి ప్రతిరోజూ తినే బిస్కెట్లను తయారు చేయడానికి పామాయిల్ ఉపయోగిస్తారు. పామాయిల్ 100 శాతం కొవ్వు  కలిగి ఉంటుంది. దీనిని ఉపయోగించడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పామాయిల్‌  ఎక్కువగా ఉపయోగించడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అనేక రకాల గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

 సోడియం..

సాధారణంగా బిస్కెట్లు తీపిగా ఉంటాయి, కానీ బిస్కెట్ల తయారీలో ఉప్పును కూడా ఉపయోగిస్తారని మీకు తెలుసా..? స్వీట్ బిస్కెట్లలో 25 గ్రాముల ప్యాకెట్ లో 0.4 గ్రాముల ఉప్పు ఉంటుంది. వీటిని ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల అధిక రక్తపోటు, స్ట్రోక్ , గుండె ఆగిపోయే ప్రమాదం పెరుగుతుంది.

 

ఇది కూడా చదవండి.. పగటి నిద్ర ఆరోగ్యానికి మంచిదా..? కాదా..? 

ఇది కూడా చదవండి.. మధుమేహం అదుపులో ఉండడంలేదా..? ఈటిప్స్ ఫాలో అవ్వండి.. 

ఇది కూడా చదవండి.. పిల్లలలో థైరాయిడ్ లక్షణాలు..?

 

స్టోర్ లో కొన్న బిస్కెట్లు , కుక్కీలలో బ్యూటిలేటెడ్ హైడ్రాక్సీనిసోల్ (బీహెచ్ఏ) బ్యూటిలేటెడ్ హైడ్రాక్సీటోలున్ (బీహెచ్ టీ) ఉంటాయి. ఇవి రెండూ రక్తానికి హానికరం. బిస్కెట్లలో సోడియం బెంజోయేట్ కూడా ఉంటుంది. ఇది డీఎన్ఏను దెబ్బ తీస్తుంది. 

అతిగా తినాలనిపిస్తుంది..  

2013లో కనెక్టికట్ కాలేజీలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, బిస్కెట్లు తినడం వల్ల మెదడుకు కొకైన్, మార్ఫిన్ లాగానే ఆనందాన్ని ఇస్తాయి. అందుకే కొంతమంది బిస్కెట్స్ ఎక్కువగా అలవాటు చేసుకుంటారు. 

 

ఇది కూడా చదవండి.. అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎర్గోనామిక్ ఫర్నిచర్ పాత్ర.. ?

ఇది కూడా చదవండి.. ఓరల్ క్యాన్సర్ లక్షణాలను ముందుగా ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..  పిల్లలకు ఇచ్చే టీకాల ప్రాముఖ్యత తెలుసా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి..ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.