Harmful Bacteria : చెప్పులూ, బూట్లు ఇంట్లోకి తెస్తే అనారోగ్యకరమైన బ్యాక్టీరియా వస్తుందా..?
సాక్షి లైఫ్ : ఆఫీసు నుంచి కానీ లేదా మార్కెట్ కు గానీ వెళ్లొచ్చి, బయటి నుంచి ఇంటికి రాగానే, 'ఫట్' మని డోర్ తీసి షూస్ లేదా చెప్పులతో లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నారా? అయితే, ఒక్క నిమిషం ఆగండి! మీ చెప్పులు, బూట్ల ద్వారా మీరు కేవలం దుమ్ము, ధూళిని మాత్రమే ఇంట్లోకి తీసుకురావడం లేదు. మీ పాదరక్షల అడుగున అంటుకుని తీవ్రమైన వ్యాధులకు కారణమయ్యే బాక్టీరియా వస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ అలవాటును మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ప్రీ-మెనోపాజ్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి..? అవేంటి..?
మీరు బయట నడిచేటప్పుడు మీ బూట్ల అరికాళ్లకు కేవలం మట్టి మాత్రమే అంటుకోదు. పురుగుమందులు, రసాయనాలు.. పొలాల వద్ద, పార్కులలో వాడే ప్రమాదకరమైన పురుగుమందుల అవశేషాలు.
వైరస్‌లు, బ్యాక్టీరియా.. కనిపించని క్రిములు, సీసం వంటి భారీ లోహాలు, ఇవి నేల నుంచి మీ ఇంట్లోకి చేరతాయి. ఈ హానికరమైన అంశాలన్నీ బూట్ల లేదా చెప్పుల ద్వారా నేరుగా మీ ఇంట్లోకి చేరుతాయి.
96శాతం చెప్పులు, బూట్లలో 'మల సంబంధిత' బ్యాక్టీరియా..!
96శాతం బూట్ల అరికాళ్ళలో E. coli (ఈ-కోలి) అనే బ్యాక్టీరియా ఉన్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. E. coli అంటే ఏమిటి? ఈ బ్యాక్టీరియా మలంతో (Fecal Matter) సంబంధం కలిగి ఉంటుంది. ప్రమాదం ఏమిటి? ఇది తీవ్రమైన కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్లకు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు (UTIలు) ప్రధాన కారణంగా మారుతుంది.
చిన్నపిల్లలకు మరింత ముప్పు..
ఇంట్లో ముఖ్యంగా నేలపై పాకే చిన్నపిల్లలు ఉంటే, ఇది వారికి మరింత అనారోగ్యకరం. చిన్నపిల్లలు నేలపై దొరికిన వస్తువులను, చేతులను నోట్లో పెట్టుకుంటారు. మురికి బూట్ల లేదా చెప్పుల ద్వారా నేల మీద ఉన్న బ్యాక్టీరియా, విషపదార్థాలు సులభంగా వారిపై దాడి చేస్తాయి, తద్వారా వారిని తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తాయి.
ఆరోగ్యంగా ఉండాలంటే ఇదే సులభమైన మార్గం..!
ఈ ప్రమాదాలను నివారించడానికి, ఆరోగ్యకరమైన ఇంటి వాతావరణాన్ని కాపాడుకోవడానికి, వైద్యనిపుణులు ఇస్తున్న ఏకైక, సులభమైన సలహా ఇదే..ఇంటి వెలుపల బూట్లు, చెప్పులు ఉంచకూడదని..! మీ ఇంట్లోకి లేదా ఇతరుల ఇంట్లోకి ప్రవేశిస్తున్నా సరే, గుమ్మం బయటే మీ పాదరక్షలను వదిలివేయడం అనేది అత్యంత సురక్షితమైన, ఆరోగ్యకరమని వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
