శరీరంలోని విషపదార్థాలను తొలగించడానికి నిద్రపోయే ముందు ఇలా చేయండి..
సాక్షి లైఫ్ : రాత్రి సమయంలో నిద్రించే ముందు నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఏ నీరు తాగాలి..? చల్లని నీరా..? లేదా వేడి నీరా..? రాత్రి పడుకునే ముందు ఎలాంటి నీరు తాగాలి, రాత్రిపూట నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
రాత్రి పడుకునే ముందు నీరు తాగడం ద్వారా శరీరాన్ని నిర్విషీకరణ చేయవచ్చు. అందుకు నిద్రపోయే ముందు రాత్రి నీరు తాగడం ఇంకా బెస్ట్ అని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఇలా నీరు తాగడం ద్వారా రాత్రంతా శరీరం హైడ్రేటెడ్గా ఉండడానికి వీలుకలుగుతుంది. ఈ అలవాటు మీకు ఆరోగ్యకరమైన శరీరం, మెరిసే చర్మాన్ని పొందడానికి సహాయపడుతుంది. అయితే నిద్రపోయే ముందు ఎంత నీరు తాగాలి..? ఎలాంటి నీరు తాగాలి..?
రాత్రి పడుకునే ముందు నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. నిద్రపోయే ముందు ఎలాంటి నీరు తాగాలి? అంటే వాతావరణాన్ని బట్టి వేడి నీరు లేదా చల్లటి నీరు తీసుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు వైద్యనిపుణులు.
రాత్రి పడుకునే ముందు రెండు గ్లాసుల నార్మల్ వాటర్ తాగాలి. అయితే అసిడిటీ సమస్య లేనివాళ్లు నిమ్మరసం కలిపిన వేడి నీటిని తాగవచ్చు. రాత్రి పడుకునే ముందు శరీర నిర్విషీకరణ కోసం, కొందరు కాకరకాయ రసం తాగుతారు, మరికొందరు గ్రీన్ టీ వంటి పానీయాలను తీసుకుంటారు.
ఉదయం ఖాళీ కడుపుతో ఇలాంటివి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఇవి శరీరాన్ని నిర్విషీకరణ చేస్తాయి. ఇలా చేయడం కంటే ఉదయం సమయం దొరకకపోతే లేదా శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి సులభమైన మార్గాలను అవలంబించాలనుకుంటే, మీరు ఉదయం పడుకునే ముందు కాకుండా రాత్రి పడుకునే ముందు తాగడం మంచిది.
రాత్రిపూట నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..
నిద్రపోయే ముందు నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. రాత్రిపూట పడుకునే ముందు నీరు తాగడం వల్ల నిద్రలేమి, నిద్ర సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
