జామపండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?
సాక్షి లైఫ్ : జామ..అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పండుగా ప్రసిద్ధి చెందింది. జామ ఆకులు, పండ్లు రెండూ ఆరోగ్యకరమైనవి. రోజూ ఒక జామపండు తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజన కరంగా ఉంటుంది. క్యారెట్‌లో విటమిన్ "ఏ" అధికంగా ఉండడం, కంటి చూపును మెరుగుపరుస్తుంది. జామపండులో విటమిన్ "ఏ" క్యారెట్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.కాబట్టి ప్రతి రోజు జామపండు తింటే దృష్టి సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
జామపండులో ఉన్న గ్లైసెమిక్ పదార్థాలు మధుమేహాన్ని నియంత్రించ డంలో, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే, అధిక ఆకలిని అణచివేయడం ద్వారా శరీరంలోని కొవ్వు తగ్గించడంలో జామ ప్రభావవంతంగా పనిచేస్తుంది.
జామపండులోని విటమిన్‌లు , ఫైబర్ శరీర జీవక్రియను పెంపొందించ డంలోనూ జీర్ణక్రియను సులభతరం చేయడంలోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మంచి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, మలబద్ధకం వంటి సమస్యలను పరిష్కరించడానికి, శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి జామపండు సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
