తేనే తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయా..?

షేర్ చేయండి:
తేనే తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయా..?

సాక్షి లైఫ్ : తేనే ఒక సహజ తీపి పదార్థం. కానీ ఇందులో ఉండే ఫ్రక్టోజ్, గ్లూకోజ్ కారణంగా కొంతమంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. ముఖ్యంగా, డయాబెటిస్ ఉన్నవారికి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా, తేనె ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయంపై కూడా ప్రతికూల ప్రభావం పడవచ్చు. కాబట్టి తేనె తీసుకునేప్పుడు పరిమితంగా తీసుకోవడం చాలా ముఖ్యం.

తేనెలో అధిక మొత్తంలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉంటాయి. డయాబెటిక్ ఉన్నవారికి అయితే లేదా రక్తంలో అధిక చక్కెరతో బాధపడుతుంటే, ఎక్కువ తేనె తినడం వల్ల మీ శరీరంలోని చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ సమతుల్యతను దెబ్బతీస్తుంది, ఇది డయాబెటిక్ రోగులకు సమస్యలను కలిగిస్తుంది.

కాలేయానికి మంచిది కాదు.. 

తేనెలో ఉండే ఫ్రక్టోజ్‌ను అధికంగా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తుంది. శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి కాలేయం పనిచేస్తుంది, కానీ మీరు ఎక్కువగా తేనె తిన్నప్పుడు, అది కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. అప్పుడు కాలేయం దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుంది.

 

ఇది కూడా చదవండి.. వేసవికాలంలో ఇవి ఎక్కువగా తీసుకోకూడదు.. ఎందుకంటే..? 

ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?

ఇది కూడా చదవండి.. హిమోఫిలియా ఎలా నయం అవుతుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.