వేసవికాలంలో ఇవి ఎక్కువగా తీసుకోకూడదు.. ఎందుకంటే..?  

షేర్ చేయండి:
వేసవికాలంలో ఇవి ఎక్కువగా తీసుకోకూడదు.. ఎందుకంటే..?  

సాక్షి లైఫ్ : సుగంధ ద్రవ్యాలు భారతీయ వంటకాలలో అంతర్భాగమైన ప్పటికీ, జీర్ణాశయ అసౌకర్యాన్ని నివారించడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవ డానికి వేసవికాలంలో ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎలాంటి సుగంధ ద్రవ్యాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి..? ఎలాంటివి ఆరోగ్యానికి రక్షణగా ఉంటాయనేది తెలుసుకోవాలి.. వీటిని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం ద్వారా మండే ఎండల్లోనూ హెల్తీగా ఉండొచ్చు. సమ్మర్ లో నివారించాల్సిన మసాలా దినుసుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?  

 లవంగాలు.. 

లవంగాలలో యూజీనాల్ అనే సమ్మేళనం చాలా వేడిగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. వేడి వాతావరణంలో లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తస్రావం సమస్యలు తీవ్రమవుతాయి. ముఖ్యంగా పిత్త సమస్యలను పెంచుతుంది. కాబట్టి సమ్మర్ సీజన్ లో లవంగాలను తక్కువగా ఉపయోగించడం మంచిది.

 ఇంగువ.. 

 ఇంగువను హింగ్ అని కూడా పిలుస్తారు. దీనిని సాధారణంగా భారతీయ వంటలలో రుచిని పెంచుకోవడానికి, జీర్ణ సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఉపయోగిస్తారు. అయినప్పటికీ దీనిని ఎక్కువగా తింటే పిత్త దోషం (వేడి) ఉన్నవారు వాడకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఇది వేడి సంబంధిత సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.


కారం..  

ఎండాకాలంలో ఎర్ర కారంపొడి ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్ట, గొంతు, ఛాతీలో మంట వస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను గణనీయంగా పెంచుతుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నపుడు కారం ఎక్కువగా తింటే బాడీలో హీట్ పెంచుతుంది. తద్వారా అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది. 

వెల్లుల్లి.. 

 వెల్లుల్లి బరువు తగ్గడానికి, జీవక్రియను పెంచడంతోపాటు, అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఎండాకాలంలో వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది దుర్వాసన, కడుపులో ఆమ్లత్వం ,రక్తస్రావం వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది.


 అల్లం.. 

శరీరంలో వేడిని పెంచేవాటిలో అల్లం ప్రసిద్ధి చెందింది. ఇది శీతాకాలంలో ప్రయోజనకరంగా ఉంటుంది కానీ వేసవికి తగినది కాదు. అధిక మొత్తంలో అల్లం తీసుకోవడం వల్ల అతిసారం, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా వేడి వాతావరణంలో అల్లం తింటే కడుపులో మంటగా అనిపిస్తుంది. 

ఇది కూడా చదవండి.హిమోఫిలియా ఎలా నయం అవుతుంది..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.