గోరువెచ్చని నీళ్లు తాగితే వెయిట్ లాస్ అవుతారా..? నిజమేనా..?
సాక్షి లైఫ్ : శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడానికి తగిన మోతాదులో నీరు తాగడం చాలా అవసరం. రోజుకు కనీసం రెండున్నర లీటర్లు లేదా మూడు లీటర్ల వరకు నీరు తాగాలని డాక్టర్లు చెబుతున్నారు. నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. నీరు పుష్కలంగా తాగడం వల్ల అనేక వ్యాధులనుంచి దూరంగా ఉండొచ్చు. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక గ్లాసు వేడి నీరు తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో తెలుసా..? నిజానికి ఉదయం నిద్ర లేవగానే వేడినీళ్లు తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. కొంత మంది బరువు తగ్గేందుకు ఉదయాన్నే వేడినీళ్లు కూడా తాగుతుంటారు. వేడి నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుంది.
ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
మన ఆరోగ్యానికి తాగునీరు చాలా ముఖ్యం. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున వేడి నీళ్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు వైద్యనిపుణులు. అందుకే మన పెద్దలు కూడా రోజూ ఉదయాన్నే వేడినీళ్లు తాగాలని సూచిస్తుంటారు. రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బీపీ అదుపులో..
స్నానానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
డైజేషన్..
రోజూ ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండడమేకాకుండా జీవక్రియ వేగవంతం అవుతుంది. అంతేకాదు బరువును తగ్గించడంలో ఎంతోబాగా సహాయపడుతుంది. అలాగే ఉదయాన్నే వేడినీళ్లు తాగడం వల్ల మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు దరిచేరవు.
డిటాక్సిఫికేషన్..
రోజూ వేడి నీరు తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ పిండుకుని తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇది శరీరంలో ఉండే విషాన్ని తొలగిస్తుంది. ఇది కాలేయానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
అధిక బరువు..
వేడి నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు కరిగిపోతుంది. బరువు అదుపులో ఉండడమే కాకుండా జీవక్రియను వేగవంతం చేస్తుంది.రోజూ ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇది చర్మంలోని టాక్సిన్స్, మురికిని తొలగిస్తుంది. వేడి నీటిని తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయి. అంతే కాకుండా చర్మం పొడిబారకుండా చేసి హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.
ఇది కూడా చదవండి..వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
