స్పైసీ ఫుడ్ వల్ల అల్సర్ వస్తుందా..?
సాక్షి లైఫ్ : వాస్తవం ఏమిటంటే..? చాలా మంది స్పైసీ ఫుడ్ వల్ల అల్సర్ వస్తుందని నమ్ముతారు. కానీ ఇది పూర్తిగా తప్పు. హెలికోబాక్టర్ పైలోరీ (హెచ్ పైలోరీ) అనే బ్యాక్టీరియా వల్ల అల్సర్ వస్తుంది. ఈ బాక్టీరియా కడుపులోపల,చిన్న ప్రేగులకుకూడా సోకుతుంది. దీని కారణంగా కడుపులో మంటగా అనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో స్పైసీ ఫుడ్ తీసుకున్నపుడు అల్సర్ సమస్యలో సమస్యగా మారవచ్చు, కానీ అది దానికి కారణం కాదు.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
హెచ్ పైలోరి బ్యాక్టీరియా
అల్సర్‌లు ఒత్తిడి లేదా కొన్ని ఆహారాలు తినడం వల్ల వస్తాయని నమ్ముతుంటారు. కానీ అది నిజం కాదు. హెచ్ పైలోరి బ్యాక్టీరియా, ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్ వంటి నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAID)ల వల్ల సంభవిస్తాయి. 2006సంవత్సరంలో జరిగిన అధ్యయనంలో క్యాప్సైసిన్ కడుపులో అల్సర్లను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుందని కనుగొన్నారు.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. జీర్ణ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏమేం చేయాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
