గాడిద పాలల్లో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..? నిజమెంత..? 

సాక్షి లైఫ్ : విటమిన్లు, మిన‌ర‌ల్స్ కలిగిన ఆహారాలు తినడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. అందుకోసం జనాలు ఇటీవల కొత్త, పాత పద్దతులను అనుసరిస్తున్నారు. అందులోభాగంగానే ఇటీవల చాలా మంది ఆరోగ్యం కోసం గాడిద పాలు తాగుతున్నారు. అందుకనే ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక చోట్ల గాడిద పాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అసలు ఈ గాడిద పాలకు డిమాండ్ పెరగడానికి కారణాలేంటో తెలుసుకుందాం.. !

పలు రకాల వ్యాధులు.. 

గాడిద పాలు తాగండం వల్ల పలురకాల వ్యాధులు దరిచేరకపోగా, వచ్చిన  జబ్బులు కూడా నయమవుతాయన్న ప్రచారం ఉంది. రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచే ప్రోటీన్లు సైటోకిన్‌ల విడుదలను ప్రోత్సహించే సామర్థ్యాన్ని గాడిద పాలు కలిగి ఉన్నాయి. గాడిద పాలు కణాలను నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేయడానికి కారణమవుతాయి.

నైట్రిక్ ఆక్సైడ్.. 

 రక్త నాళాలను విడదీసి, నైట్రిక్ ఆక్సైడ్ మీ రక్త నాళాలకు అందించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది.గాడిద పాలు ఆహార పదార్థంగా కంటే ఎక్కువ సౌందర్య సాధనంగా పనిచేస్తాయి. వీటిలోని ప్రొటీన్లు నీటిని ఆకర్షించి , పట్టు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. 

యాంటీఆక్సిడెంట్లు.. 

ఇవి మీ శరీరానికి అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తాయి.వీటిలోని ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లుగా కూడా పనిచేస్తాయి. అవి సూర్యరశ్మి వలన కలిగే ఆక్సీకరణ నష్టం నుంచి కణాలను రక్షించడంలో సహాయపడతాయి, తద్వారా వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి. 

సౌందర్య ఉత్పత్తులు.. 

గాడిద పాలతో స్నానం చేయడం వల్ల మెత్తని, మృదువైన చర్మం మీ సొంతం చేసుకోవచ్చు. గాడిద పాలు సౌందర్య ఉత్పత్తులైన స్కిన్ క్రీములు, ఫేస్ మాస్క్‌లు, సబ్బులు మరియు షాంపూల తయారీలో వాడతారు.


గాడిద పాలల్లో  తల్లిపాలు, ఆవు పాలతో సమానమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయట. అందుకనే శిశువులకు ఇవి పట్టించడం మంచిదని అంటుంటారు. వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి తాగడం వల్ల శరీరానికి కేలరీలు, విటమిన్- డి ఎక్కువగా అందుతాయి. ఇవి లాక్టోస్ రూపంలో ఉంటాయి. 

ఇన్ఫెక్షన్లను నయం.. 


ఆర్థరైటిస్, దగ్గు జలుబు లాంటి ఇన్ఫెక్షన్లను నయం చేయడంతో పాటు గాయాలకు చికిత్స చేసేందుకు గాడిద పాలు ఉపయోగిస్తారు. దీంట్లోని యాంటీ-మెక్రోబయాల్ లక్షణాలు అంటువ్యాధులు, బ్యాక్టీరియా, ఇతర వైరస్ల నుంచి దూరం చేసేందుకు సహాయపడతాయి.

 రోగనిరోధక శక్తి.. 

 ముఖ్యంగా అలెర్జీని దూరం చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆవు పాలతో పోలిస్తే.. గాడిద పాలలో ఐదు రెట్లు తక్కువ కెసిన్, సమానస్థాయిలో ప్రొటీన్లు కలిగి ఉంటాయి. అందుకనే వీటిని తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. గాడిద పాలలో మరొక ముఖ్యమైన భాగం లాక్టోస్. ఇది మీ శరీరం కాల్షియం గ్రహించడానికి సహాయపడి, ఎముక‌ల‌ను బ‌లంగా మారుస్తుంది. వీటిలోని ఇతర సమ్మేళనాలు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి. 

ఇవన్నీ నిజమేనా..? 

వాస్తవానికి గాడిద పాలు తాగితే మంచిదనే మాట ఇప్పటిదేమీ కాదు.. మన పూర్వీకులు వీటిని తాగడం మంచిదని ద‌శాబ్దాలుగా చెబుతు న్నారు. ముఖ్యంగా పసి పిల్లలు ఇవి తాగడం వల్ల వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నమ్మేవారు. మరి ఇవన్నీ నిజమేనా.. గాడిద పాలు ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయి. ఆవు, మేక, గొర్రె, గేదె, ఒంటె లాంటి ఇతర పాడి జంతువుల పాలతో పోలిస్తే, గాడిద పాలు తల్లి పాలకు చాలా దగ్గరగా ఉంటాయట. 

డిమాండ్ ఎక్కువ.. 

19వ శతాబ్దంలో ఆకలితో అలమటిస్తున్న అనాథ శిశువుల కడుపు నింపడానికి గాడిద పాలను తాగించార‌ట‌. అప్పటి నుంచి గాడిద‌ల పెంపకం, పాల విక్రయం పెరుగుతూ వస్తుంది. అయితే ఒక్కో గాడిద‌ రోజుకు 4 కప్పుల (1 లీటరు) పాలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అందువల్లే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు గాడిద పాలలో ఔషధ గుణాలతో పాటు సౌందర్యాన్ని పెంచే గుణాలు కూడా ఉంటాయట. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.


 

Tags : donkey-milk
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com