Best Foods for Heart : గుండె పదిలంగా, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ ఇవి తినాల్సిందే..!
సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి కారణంగా నేడు చిన్నవయసు వారు, చిన్నారులు సైతం గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు (high blood pressure), కొలెస్ట్రాల్ (high cholesterol) వంటి సమస్యలు యువతను తీవ్రంగా వేధిస్తున్నాయి. ఆహారపు అలవాట్లలో లోపాలు, విపరీతమైన ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గుండెను దీర్ఘకాలం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచుకోవాలంటే మందులు, వ్యాయామంతో పాటు రోజూ తీసుకునే ఆహారంపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కార్డియాలజిస్టులు సూచిస్తున్నారు. నూనెలో వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంటూ.. మొక్కల ఆధారిత ఆహారాన్ని(plant based food) తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా కాపాడుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని పెంచే ఆ 4 ముఖ్యమైన ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
1. నట్స్, సీడ్స్ ..
బాదం, వాల్నట్స్ (walnuts), అవిసె గింజలు, చియా సీడ్స్ పోషకాలకు గనులు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును అదుపులో ఉంచుతాయి. రోజూ పరిమిత మోతాదులో వీటిని తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుంది.
2. గ్రీన్ టీ..
గ్రీన్ టీలో 'కాటెచిన్స్' అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలకు జరిగే నష్టాన్ని నివారించి, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. రోజూ రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్ టీ తాగడం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
3. అవకాడో..
అవకాడోలో గుండెకు మేలు చేసే 'మోనోఅన్‌శాచురేటెడ్' కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వారానికి కనీసం రెండుసార్లు అవకాడో తినేవారిలో గుండె, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధుల ముప్పు 21 శాతం వరకు తగ్గుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది.
4. ఆకుకూరలు, కూరగాయలు..
పాలకూర,బ్రకోలీ వంటి ఆకుపచ్చని కూరగాయల్లో పీచుపదార్థం (fiber), విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. వీటిలోని విటమిన్-కె రక్తప్రసరణ సాఫీగా సాగేందుకు తోడ్పడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడి, బీపీని అదుపులో ఉంచుతుంది.
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
