Protein : ప్రొటీన్ బాడీ బిల్డింగ్ కోసమే కాదు.. శరీరంలో ఈ ముఖ్యమైన పనులన్నింటికీ తప్పనిసరి..!
సాక్షి లైఫ్ : శరీరం ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు సమతులంగా ఉండాలి. ముఖ్యంగా 'ప్రొటీన్' (Protein) అనేది మన శరీరానికి ప్రతిరోజూ అత్యవసరమైన పోషకం. చాలామంది కేవలం కండరాలు పెంచుకోవడానికి, జిమ్ చేసేవారికి మాత్రమే ప్రొటీన్ అవసరమని భావిస్తుంటారు. కానీ.. శరీరంలోని ప్రతి కణం నిర్మాణం నుంచి రోగనిరోధక శక్తి వరకు ప్రొటీన్ పాత్ర ఎంతో కీలకమని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
రోజుకు ఎంత ప్రొటీన్ (Protein)అవసరం..?
సాధారణ ఆరోగ్యవంతులైన పెద్దలకు వారి శరీర బరువులో ప్రతి కిలోకు సుమారు 0.8 గ్రాముల ప్రొటీన్ రోజూ అవసరమవుతుంది. ఉదాహరణకు.. 75 కిలోల బరువున్న వ్యక్తికి రోజుకు కనీసం 60 గ్రాముల ప్రొటీన్ అందాలి. అయితే వయసు, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితులను బట్టి ఈ మోతాదు మారుతూ ఉంటుంది. దీర్ఘకాలం పాటు ప్రొటీన్ లోపం ఉంటే కండరాలు బలహీనపడటంతో పాటు అంతర్గత అవయవాల పనితీరుపైనా తీవ్ర ప్రభావం పడుతుంది.
ప్రొటీన్ లోపంతో కలిగే ప్రధాన నష్టాలు..
1. పిల్లల ఎదుగుదలపై ప్రభావం.. '
ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు ప్రొటీన్ చాలా ముఖ్యం. ఇది వారిలో కండరాలు, ఎముకలు, కొత్త కణజాలాల నిర్మాణానికి తోడ్పడుతుంది. పిల్లలకు సరైన మోతాదులో ప్రొటీన్ అందకపోతే వారి ఎత్తు, బరువు పెరగడం ఆగిపోవచ్చు. తీవ్రమైన లోపం ఉంటే వారి మెదడు వికాసం, నేర్చుకునే సామర్థ్యంపైనా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది.
2. రోగనిరోధక శక్తి క్షీణించడం..
మన శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేయాలంటే ప్రొటీన్ తప్పనిసరి. వ్యాధులతో పోరాడే యాంటీబాడీలు, రోగనిరోధక కణాల తయారీలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ప్రొటీన్ తగ్గితే ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం పెరగడమే కాకుండా, అనారోగ్యం నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.
3. కండరాల బలహీనత..
కండరాల నిర్మాణానికి, వాటి మరమ్మతులకు ప్రొటీన్ ఇంధనంలా పనిచేస్తుంది. ఆహారం ద్వారా తగినంత ప్రొటీన్ లభించనప్పుడు, శరీరం తనకు అవసరమైన శక్తి కోసం కండరాల కణజాలాన్నే వినియోగించుకోవడం ప్రారంభిస్తుంది. దీనివల్ల కండరాలు క్షీణించి విపరీతమైన నీరసం, బలహీనత వేధిస్తాయి.
4. గాయాలు మానడంలో ఆలస్యం, చర్మ సమస్యలు..
శరీరంలో కొత్త కణాలు పుట్టడానికి, దెబ్బతిన్న కణజాలం బాగుపడటానికి ప్రొటీన్ ఎంతో అవసరం. దీని లోపం వల్ల శరీరంపై అయ్యే గాయాలు త్వరగా మానవు. అంతేకాకుండా చర్మం కాంతివిహీనంగా మారడం, జుట్టు విపరీతంగా రాలడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
