Almonds side effects : ఆరోగ్యానికి మంచిదని రోజూ గుప్పెడు బాదంపప్పు తింటున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!
సాక్షి లైఫ్ : జ్ఞాపకశక్తిని పెంచేందుకు, రోగనిరోధక శక్తిని దృఢపరి చేందుకు నిత్యం బాదం తినడం చాలామందికి అలవాటు. ప్రొటీన్లు, పీచు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్-ఇ సమృద్ధిగా లభించే డ్రైఫ్రూట్లలో బాదం అగ్రస్థానంలో ఉంటుంది. అయితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది కదా అని వీటిని అవసరానికి మించి అతిగా తింటే పలు ఆరోగ్య సమస్యలు తప్పవని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
కిడ్నీలో రాళ్ల ముప్పు పెరగొచ్చు..
బాదంపప్పులో 'ఆక్సలేట్లు' (Oxalates) అధికంగా ఉంటాయి. 100 గ్రాముల బాదంలో దాదాపు 469 మిల్లీగ్రాముల వరకు ఆక్సలేట్ ఉండవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలోకి చేరిన ఆక్సలేట్, కాల్షియంతో కలిసి 'కాల్షియం ఆక్సలేట్' స్పటికాలుగా మారి మూత్రపిండాల్లో రాళ్లు (Kidney Stones) ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు లేదా తరచూ ఈ సమస్యకు గురయ్యేవారు బాదం వినియోగాన్ని బాగా తగ్గించాలి.
బరువు పెరిగే అవకాశం..
బాదంలో మంచి కొవ్వులు ఉన్నప్పటికీ, వాటిలో క్యాలరీలు చాలా ఎక్కువ. దాదాపు 20-23 బాదం గింజలను తింటే సుమారు 164 క్యాలరీలు శరీరానికి అందుతాయి. రోజూ తీసుకునే సాధారణ ఆహారంతో పాటు పెద్దమొత్తంలో బాదం తింటూ ఉంటే శరీరంలో క్యాలరీలు పేరుకుపోయి బరువు పెరగడానికి దారితీస్తుంది.
జీర్ణ సమస్యలు, పోషకాల లోపం..
బాదంలో పీచు (fiber) పుష్కలంగా ఉంటుంది. అయితే ఒక్కసారిగా అధిక మొత్తంలో ఫైబర్ శరీరంలోకి చేరితే కడుపుబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. వీటిలో ఉండే 'ఫైటేట్' (Phytate) అనే సమ్మేళనం అధిక ఫైబర్‌తో కలిసినప్పుడు శరీరం ఐరన్, జింక్, కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలను సరిగ్గా గ్రహించకుండా అడ్డుపడుతుంది.
రోజుకు ఎన్ని బాదం పప్పులు తినడం మంచిది..?
సాధారణ ఆరోగ్యవంతులు రోజుకు 15 నుంచి 20 గింజల వరకు తీసుకోవడం సురక్షితమైన పరిమాణంగా భావిస్తారు. నీళ్లలో రాత్రంతా నానబెట్టి, పైపొట్టు తీసి తింటే జీర్ణక్రియ సులువవుతుంది. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు, బరువు నియంత్రణలో ఉండేవారు వైద్యులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాతే వీటిని ఆహారంలో చేర్చుకోవడం శ్రేయస్కరం.
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
