Tips to Prevent High Blood Pressure : బీపీ పెరగకుండా ఉండడానికి.. వైద్యులు చెసే సూచనలు..
సాక్షి లైఫ్ : పండుగల సమయంలో పిండివంటలు, మిఠాయిలు, నిద్రలేని రాత్రులు వంటివి రక్తపోటు (bp) బాధితులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండుగ ఆనందాన్ని ఆస్వాదిస్తూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పాటించాల్సిన జాగ్రత్తలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. తద్వారా హెల్దీగా ఉండొచ్చు..
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
రక్తపోటు ఎందుకు పెరుగుతుంది..?
ఉప్పు, నూనె పదార్థాలు..పండుగ వేళ తినే కారప్పూస, మిక్చర్, ప్యాక్డ్ చిప్స్ వంటి వాటిలో సోడియం (salt) అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో నీటి శాతాన్ని పెంచి, రక్తనాళాలపై ఒత్తిడి తీసుకువస్తుంది. శబ్ద కాలుష్యం..టపాసుల విస్ఫోటన శబ్దాల వల్ల ఒంట్లో 'అడ్రినలిన్' వంటి ఒత్తిడి హార్మోన్లు విడుదలై, గుండె వేగం, రక్తపోటు హఠాత్తుగా పెరుగుతాయి. షాపింగ్, ఇంటి పనుల అలసట,రాత్రి వేళల్లో సరిపడా నిద్ర లేకపోవడం వల్ల బీపీ సమతుల్యత దెబ్బతింటుంది.
బీపీ హఠాత్తుగా పెరిగినట్లు అనిపిస్తే ఏం చేయాలి..?
ఆందోళన వద్దు..అసౌకర్యంగా అనిపించినప్పుడు కంగారు పడకుండా ప్రశాంతంగా ఒక చోట కూర్చోవాలి. సరైన రీతిలో కొలవండి..5 నిమిషాలు విశ్రాంతి తీసుకున్న తర్వాతే బీపీ చెక్ చేసుకోవాలి. వెనుక వీపుకు ఆసరా ఉంచి, చేతిని గుండె సమాంతర ఎత్తులో ఉంచాలి. ఒక నిమిషం తేడాతో రెండు సార్లు రీడింగ్ తీసుకోవడం ఉత్తమం. దీర్ఘ శ్వాస..నెమ్మదిగా శ్వాస పీల్చి వదలడం వల్ల ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుంది. అయితే ఇది వైద్యులు రాసిన మందులకు ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
నిత్యం వాడే బీపీ మందులను పండుగ హడావుడిలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ప్యాక్ చేసిన స్నాక్స్, ఊరగాయలకు దూరంగా ఉండి పండ్లు, తాజా కూరగాయలు, ఇంట్లో తక్కువ ఉప్పుతో చేసిన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. శరీరానికి తగినంత నీరు తాగడం, కంటినిండా నిద్రపోవడం తప్పనిసరి. అధిక కెఫిన్, ఆల్కహాల్ అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ రక్తపోటు రీడింగ్ 180/120 mm Hg కంటే ఎక్కువ నమోదైనా, లేదా ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చూపు మసకబారడం, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా తక్షణమే వైద్యనిపుణులను సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..
ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..
