యాపిల్స్ తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే..
సాక్షి లైఫ్ : యాపిల్ పండ్లను కొంతమంది ఎక్కువగా ఇష్టపడి తింటుంటారు. యాపిల్‌లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. యాపిల్‌లో ఉండే ఐరన్ శరీరంలోని హిమోగ్లోబిన్ లోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే యాపిల్స్ అధికంగా తీసుకోవడం వల్ల ప్రయోజనాలకు బదులుగా ఆరోగ్యానికి హాని కలుగుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి యాపిల్ తినడం వల్ల కలిగే అనర్థాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
అధిక బరువు సమస్య..
యాపిల్స్‌ను ఎక్కువగా తీసుకుంటే, బరువును పెరుగుతారు. ఎందుకంటే..? యాపిల్‌తో కేలరీలు, చక్కెరలు ఎక్కువగా శరీరానికి లభిస్తాయి. దీని వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది.
జీర్ణక్రియ సమస్యలు..
యాపిల్‌లో ఉండే అధిక ఫైబర్ కారణంగా, కొన్నిసార్లు జీర్ణాశయ వ్యవస్థలో గ్యాస్ ఏర్పడుతుంది. దీని కారణంగా, కడుపు నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.
బ్లడ్ షుగర్..
మధుమేహ బాధితులు యాపిల్స్ తక్కువగా తీసుకోవడం మంచిది. యాపిల్‌లో కార్బోహైడ్రేట్‌లు, ఫైబర్ ఇతర పోషకాలు ఉంటాయి. కానీ వాటిని అధికంగా వాడటం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి.
దంత సమస్యలు..
యాపిల్‌లో దంతాలను దెబ్బతీసే యాసిడ్ ఉంటుంది. కాబట్టి అతిగా యాపిల్స్ తీసుకుంటే దంతాల సమస్యలు తలెత్తుతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.
కళ్లకు మేలు..
యాపిల్ చర్మ వ్యాధులు, గుండెపోటు, జ్వరం, మలబద్ధకం తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ "సి", విటమిన్ "బి" లభిస్తాయి. ఇది కళ్లకు చాలా మేలు చేస్తుంది.
ఇది కూడా చదవండి.. హోమియోపతి వైద్యం దేనిపై ఆధారపడి పనిచేస్తుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
