Eco-Friendly Breast Cancer Surgeries : పర్యావరణ హితంగా రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్సలు.. సక్సెస్ అయిన పైలట్ ప్రాజెక్ట్.!

సాక్షి లైఫ్ : వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. కేవలం రోగి ఆరోగ్యమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా నిర్వహించిన ఒక పైలట్ అధ్యయనంలో పర్యావరణ హిత రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్స (Sustainable Breast Cancer Surgery) విజయవంతమైంది. శస్త్రచికిత్స నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండానే, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు నిరూపించారు.

 

ఇది కూడా చదవండి..Obesity and inflammation : ఒబెసిటీకి ఇన్‌ఫ్లమేషన్‌కు లింక్ ఏమిటి..?

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి..Coconut Water : కొబ్బరి బొండం నీళ్లతో బరువు తగ్గొచ్చా..?

 

5R ఫార్ములాతో గ్రీన్ ప్రోటోకాల్.. 

ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 'గ్రీన్ ప్రోటోకాల్'ను అనుసరించారు. ఇది ప్రధానంగా 5R సూత్రాలపై (Reduce-తగ్గించడం, Reuse-మళ్ళీ వాడటం, Recycle-రీసైక్లింగ్, Rethink-పునరాలోచన, Research-పరిశోధన) ఆధారపడి సాగింది. 2024 సెప్టెంబర్ నుంచి 2025 మే మధ్య జరిగిన ఈ పరిశోధనలో రోగులను రెండు గ్రూపులుగా విభజించి చికిత్స అందించారు.

పర్యావరణ హిత మార్పులు ఏంటి.. అంటే..? 

సాధారణంగా వాడే టెక్నీషియం 99m రేడియో ట్రేసర్లకు బదులుగా, పర్యావరణానికి తక్కువ హాని చేసే 'ఇండోసైనిన్ గ్రీన్' పద్ధతిని వాడారు. ఒకేసారి వాడి పారేసే గౌన్లు, డ్రేప్స్, సర్జికల్ పరికరాలకు బదులుగా నాణ్యమైన, మళ్ళీ వాడదగిన (Reusable) వస్త్రాలు, పరికరాలను వినియోగించారు. ఆపరేషన్ థియేటర్లో వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు వేరు చేసి, ఇన్ఫెక్షన్ లేని ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్‌కు పంపారు. రోగికి పూర్తిస్థాయి అనస్థీషియా ఇవ్వకుండా, లోకల్ అనస్థీషియా, ఐవీ సెడేషన్‌తోనే శస్త్రచికిత్స పూర్తి చేశారు.

రోగులకు కలిగిన ప్రయోజనాలు.. 

ఈ కొత్త పద్ధతి వల్ల కేవలం పర్యావరణానికే కాదు, రోగులకు కూడా ఎంతో మేలు చేకూరింది. ఈ ప్రోటోకాల్ పాటించిన వారిలో దాదాపు 58.8 శాతం మంది రోగులు శస్త్రచికిత్స జరిగిన రోజే డిశ్చార్జ్ అయ్యారు. దీనివల్ల ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం తగ్గడమే కాకుండా, రోగి ప్రయాణం కూడా సులభతరమైంది.

ఎందుకు కీలకం..?

ప్రస్తుత వాతావరణ మార్పుల నేపథ్యంలో, వైద్య రంగం నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలు తగ్గించడం అత్యవసరమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలు ప్రాథమికంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సలో పర్యావరణ అనుకూల పద్ధతులను విస్తృతంగా అమలు చేయడానికి ఇది ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..Brain health : మీ బ్రెయిన్ కంప్యూటర్ లాగా పనిచేయాలంటే ఈ ఆహారపదార్థాలు తినండి..

ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్‌ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : women-health breast-cancer breast-cancer-treatment breast-cancer-screening eco-friendly-products
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com