చక్కెర మానేయడం వల్ల కాలేయం, మూత్రపిండాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది..?  

సాక్షి లైఫ్ : మీరు ఎప్పుడైనా 30 రోజుల పాటు చక్కెరను పూర్తిగా మానేస్తే మీ శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఆలోచించారా? అధ్యయనాలు దీని గురించి కొన్ని చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా చక్కెరను మానివేయడం వల్ల కాలేయం,మూత్రపిండాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? 
మెదడును చురుకుగా ఉంచడానికి చక్కెర ఎలాంటి పాత్ర పోషిస్తుంది..? ఇలాంటి ప్రశ్నలకు పరిశుధనలు ఏమిచెబుతున్నాయి. అనేది ఇప్పుడు తెలుసుకుందాం..  

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి...ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

 
 కాలేయ కొవ్వు తగ్గుతుంది.. 

ఈ రోజుల్లో కాలేయ కొవ్వు సమస్య సర్వసాధారణం అయ్యింది, దీనికి ప్రధాన కారణం అధిక చక్కెర వినియోగం. మీరు చక్కెర తీసుకోవడం ఆపివేసినప్పుడు, మీ కాలేయం తనను తాను రిపేర్ చేసుకోవడం ప్రారంభిస్తుంది. 30 రోజుల్లో కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు నెమ్మదిగా తగ్గుతుంది, దీనితో అది మెరుగైన పనితీరును కనబరుస్తుంది.

 మూత్రపిండాల పనితీరు..  

అధిక చక్కెర వినియోగం మూత్రపిండాలపై అదనపు భారాన్ని పెంచుతుంది. అందుకే, మీరు చక్కెరను వదిలివేసినప్పుడు, మీ మూత్రపిండాలకు విశ్రాంతి లభిస్తుంది. తద్వారా వాటి పనితీరు మెరుగుపడుతుంది. ఇది దీర్ఘకాలికంగా మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

 ధమనులలో వాపు..  

 శరీరంలో వాపుకు చక్కెర ఒక ప్రధాన కారణం, ముఖ్యంగా మీ ధమనులలో. ఈ వాపు భవిష్యత్తులో గుండె జబ్బులకు దారితీస్తుంది. 30 రోజుల పాటు చక్కెరను తినకపోవడం వల్ల మీ ధమనులలో వాపు తగ్గుతుంది, ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో పాటు గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గుతుంది.

 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : liver-damage liver-health liver-infection kidneys-health kidney healthy-kidney fatty-liver fatty-liver-symptoms liver-injury severe-liver-damage liver-safety fatty-liver-diet fatty-liver-disease reverse-fatty-liver fatty-liver-causes liver-disease
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com