కంటి సమస్యలు, కారణాలు నివారణా మార్గాలు..?    

సాక్షి లైఫ్ : కాలక్రమేణా కంటి సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. యువత కూడా దృష్టిలోపం, చూపు మందగించడం, మయోపియా వంటి సమస్యలతో బాధపడుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులకు స్పష్టంగా చూడటానికి అద్దాలు వాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనేక కారణాల వల్ల కంటి జబ్బుల ముప్పు పెరుగుతోందని, అందులో ప్రధానమైనవి జీవనశైలి, ఆహారపు లోపాలు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఈ కంటి సమస్యలపై సకాలంలో దృష్టి పెట్టి అవసరమైన చికిత్స తీసుకోవడం ద్వారా వాటిని నివారించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయని వాటిలో కొన్నిటిని "సైలెంట్ కిల్లర్లు" గా పరిగణిస్తారని  వైద్యులు అంటున్నారు. 

అధిక రక్తపోటు కారణంగా.. 

అధిక రక్తపోటు సమస్య ఉంటే, అది గుండె ఆరోగ్యానికే కాకుండా, కళ్ల ఆరోగ్యానికి కూడా ప్రమాదకరమే.. హైబీపీ కళ్ళపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అధిక రక్తపోటు కారణంగా రెటీనాలోని రక్త నాళాలు దెబ్బతింటాయి. ఇది కంటిలోకి ప్రవేశించే కాంతి, చిత్రాలను, మెదడుకు పంపిన నరాల సంకేతాలను మార్చగలదు. అధిక రక్తపోటు వల్ల రెటీనా దెబ్బతినడాన్ని హైపర్‌టెన్సివ్ రెటినోపతి అంటారు.

హై బ్లడ్ షుగర్ వల్ల.. 

అధిక రక్తపోటుతో పాటు హై బ్లడ్ షుగర్ కారణంగా కూడా కళ్ళకు హాని జరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారిని ప్రభావితం చేసే కంటి వ్యాధులు డయాబెటిక్ రెటినోపతి, మాక్యులర్ ఎడెమా. ఇది సాధారణంగా డయాబెటిక్ రెటినోపతి కారణంగా వస్తుంది. కంటిశుక్లం, గ్లాకోమా వంటివి దృష్టి లోపానికి దారితీయవచ్చు. 

 అయితే తక్షణ రోగ నిర్ధారణ, చికిత్స అనేవి కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వారు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే హైబీపీ ఉన్నవారు కూడా బీపీని నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా కొంతమేర కంటి సంబంధిత సమస్యల నుంచి బయట పడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.    


గ్లకోమా లక్షణాలు..?

దృష్టి కోల్పోవడం
మస్క మస్కగా కనిపించడం
కంటిన్యూగా తలనొప్పి.. 
కళ్ళు ఎర్రబడటం.. 
కడుపు నొప్పి, వికారం, వాంతులు
కంటి నొప్పి.. 
ఎర్లీ ప్రెస్బియోపియా.. 

కంటి ఇన్ఫెక్షన్.. 

కంటి ఇన్ఫెక్షన్ అనేక రకాల కంటి వ్యాధులకు కారణమవుతుంది. కంటి ఇన్ఫెక్షన్లు బ్యాక్టీరియా, వైరస్లు లేదా ఫంగస్ వంటి సూక్ష్మజీవుల వల్ల సంభవించవచ్చు. కండ్లకలక అటువంటి సమస్యల్లో ఒకటి. అంటు వ్యాధుల విషయంలో కళ్లు ఎర్రగా ఉండడం, నొప్పిగా అనిపించడం, మంటగా అనిపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటిని సకాలంలో పట్టించుకోకపోతే పరిస్థితి మరింత ముదిరే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కళ్లను సురక్షితంగా ఉంచుకోవడం ఎలా..?

కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ప్రతిరోజూ చల్లని నీతితో శుభ్రం చేసుకోవాలి. కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ముందుగా ఆహారాన్ని మెరుగుపరుచుకోవాలని కంటివైద్యులు చెబుతున్నారు. అందుకోసం కొన్ని ఆహార పద్దార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ కంటి వ్యాధుల ప్రమాదాన్ని 60 శాతం తగ్గించడంలో సహాయపడుతుందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. 

చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఒమేగా -3 ఎక్కువ పరిమాణంలో ముఖ్యంగా కొవ్వు చేపలను తినడం ద్వారా పొందవచ్చు. ఈ పోషకాలు కళ్లకు మాత్రమే కాకుండా గుండె, మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా మేలు చేస్తాయి. 


సిట్రస్ పండ్లు.. 

సిట్రస్ పండ్లు అంటే విటమిన్ "సి" పుష్కలంగా ఉండే పండ్లు.వీటిలో విటమిన్ "ఇ", విటమిన్ "సి" తోపాటు యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి  వయస్సు సంబంధిత కంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. నిమ్మ, నారింజ మొదలైన విటమిన్ "సి" పుష్కలంగా ఉండే సిట్రస్ పండ్లను మీ ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా విటమిన్ "సి" ఉన్న ఆహారాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా మేలు చేస్తాయి.

కంటి సమస్యలకు సంబంధించిన వాస్తవాలు.. 

2050 నాటికి, ది లాన్‌సెట్‌లోని ఒక నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 8కోట్ల 95లక్షల మందిలో కంటి సంబంధిత సమస్యలు తలెత్తవచ్చని అంచనా. 

వచ్చే 30 ఏళ్లలో దృష్టిలోపంతో బాధపడేవారి 150 శాతం పెరుగుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. 65 సంవత్సరాల వయస్సు వారికి 90 శాతం కంటే ఎక్కువ మందికి కంటిశుక్లాల సమస్య ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. 

ఇది కూడా చదవండి..   కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : eye-health
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com