కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు..?

సాక్షి లైఫ్ : శరీరంలో హార్మోన్ల మార్పులు, బరువు తగ్గడం లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుంది లేదా తగ్గుతుంది. LDL అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయి 100 కంటే తక్కువ సాధారణం160 కంటే ఎక్కువ ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. అదే సమయంలో హెచ్‌డిఎల్ మొత్తం అంటే మంచి కొలెస్ట్రాల్ 60 కంటే ఎక్కువ సురక్షితమైనదిగా పరిగణిస్తారు. 40 కంటే తక్కువ ఉంటే అసురక్షితంగా పరిగణిస్తారు. 200 కంటే తక్కువ కొలెస్ట్రాల్ స్థాయి ఆరోగ్యకరమైనది. 240 కంటే ఎక్కువ ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు.

ఇది కూడా చదవండి..జికా వైరస్ డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుందా..?

 కొలెస్ట్రాల్ పెరగడానికి..  

సాధారణంగా కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే ఇష్టమైన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు కొందరు. అయితే కేవలం ఆహారం వల్ల కొలెస్ట్రాల్ పెరగదని తెలుసుకోవాలి. పీరియడ్స్, ఇన్సులిన్, థైరాయిడ్ వంటి కారణాల వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. మిఠాయిలు ఎక్కువగా తినడం, అధిక ఒత్తిడి స్థాయిల కారణంగా కూడా ఇది పెరుగుతుంది.

 కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలంటే..?  

ఫైబర్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.  అవకాడో, నట్స్, చియా సీడ్స్, ఫిష్ వంటి ఆహారాలను ఎక్కువగా తినాలి. మోనోశాచురేటెడ్ , పాలీసాచురేటెడ్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవాలి. స్ట్రెస్ ను తగ్గించుకోవాలి.. ఈ విషయాలను ఫాలో అవ్వడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను సులభంగా నియంత్రించవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇది కూడా చదవండి.. తినే సమయంలో నీళ్లు తాగకూడదా..? ఏమౌతుంది..?     

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?   

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : bad-cholesterol eating-habits healthy-habits diagnose healthy-habit food-habits good-habits good-cholesterol hdl ldl cholesterol
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com