వృద్ధులకు చికున్ గున్యా టీకా ప్రమాదకరం.. ఎఫ్ డిఏ హెచ్చరిక
సాక్షి లైఫ్ : వృద్ధులకు చికున్ గున్యా వ్యాధి నివారణ టీకాను తీసుకోవడంపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డిఏ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ టీకా వృద్ధుల్లో తీవ్రమైన న్యూరోలాజికల్ సమస్యలకు దారితీస్తున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి..హిమోగ్లోబిన్ పెంచే బెస్ట్ ఫుడ్..?
ఇది కూడా చదవండి..కొత్తిమీర ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధం..
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు పెరగడానికి ఇవే కారణం..
వృద్ధుల్లో న్యూరోలాజికల్ సమస్యలు..
చికున్ గున్యా టీకా వృద్ధుల్లో గులియన్ బారీ సిండ్రోమ్ (Guillain-Barré Syndrome - జీబీఎస్) వంటి అరుదైన న్యూరోలాజికల్ సమస్యలకు కారణమవుతున్నట్లు గుర్తించారు. జీబీఎస్ అనేది శరీరంలో రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేయడం వల్ల కలిగే పరిస్థితి, ఇది పక్షవాతం వంటి లక్షణాలను కలిగిస్తుంది.
ఎఫ్ డిఏ సూచనలు..
వృద్ధులు చికున్ గున్యా టీకాను తీసుకోవడంపై పునఃసమీక్ష ఎఫ్ డిఏ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ టీకా తీసుకోవడం వృద్ధుల ఆరోగ్యానికి ప్రమాదకరమని సూచించడం లేదు, కానీ టీకా తీసుకునే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవాలని సూచించింది.
చికున్ గున్యా వ్యాధి నివారణ కోసం టీకాలు అవసరమైనప్పటికీ, వృద్ధుల ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని టీకా తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?
ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?
ఇది కూడా చదవండి..ప్రోటీన్ లోపంవల్ల తలెత్తే 6 అనారోగ్య సమస్యలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
