ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?
సాక్షి లైఫ్ : జీవనశైలిలో మార్పులు, ఆహార పోషకాహారం, కొన్ని సాధారణ అలవాట్లను మార్చడం ద్వారా నిద్ర నాణ్యతను మెరుగుపరచవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిద్రను మెరుగుపరచడంలో సహాయపడే '10-3-2-1-0 నియమం' గురించి సూస్తున్నారు. ఆ నియమం ఏమిటో..? మంచి నిద్ర పొందడానికి ఏ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలో తెలుసుకుందాం..?
ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..
ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..
నిద్ర నాణ్యతను కాపాడుకోవడానికి..
నిద్రవేళకు 10 గంటల ముందు : కెఫిన్ తీసుకోవడం పరిమితం చేయండి. నిద్రవేళకు మూడు గంటల ముందు : కడుపు నొప్పికి కారణమయ్యే ఆహారాన్ని తినడం మానుకోండి. నిద్రవేళకు రెండు గంటల ముందు: ఆఫీసు పని ముగించండి, కుటుంబంతో ఎక్కువ సమయం గడపండి. నిద్రవేళకు ఒక గంట ముందు: స్మార్ట్ ఫోన్,టీవీలకు దూరంగా ఉండండి.
నిద్రపోతున్నప్పుడు: మంచి నిద్రకు అనువైన వాతావరణాన్ని ఉండేలా చూసుకోండి, గదిని చీకటిగా, నిశ్శబ్దంగా ఉంచండి.
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ప్రతి ఒక్కరూ మంచి రాత్రి నిద్ర పొందడానికి మెరుగైన మార్గాలపై దృష్టి పెట్టాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. నిద్ర నాణ్యత ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడు తుందని, సరైన నిద్రలేని కారణంగా అనేక ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచే ప్రధాన కారకాల్లో నిద్ర నాణ్యత తక్కువగా ఉండటం ఒకటి అని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..లివర్ డిటాక్స్ జ్యూస్ రెసిపీ : మీ కాలేయాన్ని న్యాచురల్ గా శుభ్రపర్చుకోండి..
ఇది కూడా చదవండి..Be alert : ఫ్యాటీ లివర్ కారణంగా ముఖంపై కనిపించే 5 సంకేతాలు ఇవే..
ఇది కూడా చదవండి..కాలేయంలోని మలినాలను శుభ్రపరచడంలో సహాయపడే విజిటబుల్ జ్యూస్..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.