Monsoon Season health care : మాన్ సూన్ సీజన్ లో ఆరోగ్యం పాడుకాకుండా ఉండాలంటే ఈ 4 నియమాలు తప్పనిసరి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. వేసవి వేడి నుంచి ఈ వర్షాలు ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ, ఆరోగ్య పరంగా మాత్రం అనేక సవాళ్లను తెచ్చిపెడుతున్నాయి. వాతావరణంలో పెరిగే విపరీతమైన తేమ (Humidity) కారణంగా బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్ వేగంగా విజృంభిస్తాయి. ఫలితంగా వర్షాకాలంలో ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు, వాంతులు, టైఫాయిడ్, కలరా వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువ. ఈ సీజన్‌లో మనం తినే ఆహారం, పాటించే పరిశుభ్రతపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ వర్షాకాలంలో రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఏయే ఆహార పదార్థాల విషయంలో అప్రమత్తంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం..

 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

 

1. ఆకుకూరల విషయంలో అత్యంత జాగ్రత్త..!

పాలకూర, తోటకూర, మెంతి, క్యాబేజీ వంటి ఆకుకూరల్లో పోషకాలు మెండుగా ఉన్నప్పటికీ, వర్షాకాలంలో వీటికి కాస్త దూరంగా ఉండటమే మంచిది. కారణం ఏమిటంటే..? వర్షాల వల్ల ఆకుకూరలపై సూక్ష్మక్రిములు, కీటకాల గుడ్లు, ఫంగస్ సులభంగా చేరుకుంటాయి. కేవలం నీళ్లతో కడగడం వల్ల ఇవి పూర్తిగా తొలగిపోవు.

ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటే..? 

ఒకవేళ ఆకుకూరలు తినాలనుకుంటే, వాటిని ఉప్పు లేదా వెనిగర్ కలిపిన గోరువెచ్చని నీటిలో కాసేపు నానబెట్టి, బాగా కడగాలి. పూర్తిగా ఉడికించిన తర్వాతే తినాలి. ఈ సీజన్‌లో పచ్చి సలాడ్ల రూపంలో ఆకుకూరలను అస్సలు తీసుకోకూడదు.

2. వేపుళ్లు, జంక్ ఫుడ్‌కు నో చెప్పండి.. 

బయట వర్షం పడుతుంటే వేడివేడిగా పకోడీలు, సమోసాలు, కచోరీలు తినాలనిపించడం సహజం. కానీ, ఈ అలవాటు మీ పొట్టను ఇబ్బందుల్లో పడేస్తుంది. కారణం ఏమిటంటే..? వర్షాకాలంలో మన జీర్ణశక్తి మందగిస్తుంది. నూనె, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలు జీర్ణం కావడం కష్టమవుతుంది. ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? రోడ్డు పక్కన దొరికే వేపుళ్లలో పరిశుభ్రత లోపిస్తే అజీర్తి, గ్యాస్, ఎసిడిటీతో పాటు డయేరియా వంటి తీవ్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లో వండిన తాజా ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వండి.

3. పుట్టగొడుగులు (mushrooms) తినేటప్పుడు అప్రమత్తత..


మష్రూమ్స్ ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, ఈ సీజన్‌లో వీటి ఎంపికలో పొరపాట్లు చేయకూడదు. కారణం ఏమిటంటే..? పుట్టగొడుగులు సహజంగానే తేమ, చీకటి ఎక్కువగా ఉండే ప్రదేశాలలో పెరుగుతాయి. అందువల్ల వీటిపై బ్యాక్టీరియా చేరే అవకాశం ఎక్కువ. ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? నమ్మకమైన, నాణ్యమైన బ్రాండ్స్ లేదా నమ్మకస్థులైన విక్రేతల నుంచే పుట్టగొడుగులను కొనుగోలు చేయాలి. కాస్త పాడైనట్లు అనిపించినా వాటిని వాడొద్దు. వండడానికి ముందు వేడి నీటితో శుభ్రం చేసి, బాగా ఉడికించాలి.

4. పాలు, డైరీ ఉత్పత్తుల వినియోగం..

వర్షాకాలంలో పాలు, ఇతర పాల ఉత్పత్తుల జీవక్రియ నెమ్మదిస్తుంది. తేమ వాతావరణం వల్ల పాలు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది. పరిష్కారం..పాలు తాగే అలవాటు ఉన్నవారు, వాటిని బాగా మరిగించి మాత్రమే తీసుకోవాలి.హెల్త్ టిప్..రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. వర్షాకాలంలో కేవలం ఆహారమే కాదు, తాగే నీరు కూడా పరిశుభ్రంగా ఉండాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం వల్ల 90 శాతం జలజనిత వ్యాధులను దూరం పెట్టవచ్చు. ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తినా స్వయం వైద్యం చేసుకోకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.