Belly Fat problem : పొట్ట చుట్టూ కొవ్వు చేరిందా..? అయితే క్యాన్సర్ ముప్పు పొంచి ఉన్నట్లే..!
సాక్షి లైఫ్ : ఆధునిక జీవనశైలి, శారీరక శ్రమ లోపించడం వల్ల ఈ రోజుల్లో 'బెల్లీ ఫ్యాట్' అంటే పొట్ట చుట్టూ కొవ్వు సమస్య సర్వసాధారణంగా మారిపోయింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా మంది దీన్ని కేవలం అందవికారంగానే భావిస్తుంటారు. కానీ, ముందుకు పొడుచుకొచ్చిన పొట్ట కేవలం బట్టల సైజును పెంచడమే కాదు.. ప్రాణాంతక క్యాన్సర్లకు సైతం దారితీస్తుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. పొట్ట ఉన్న ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ వస్తుందని దీని అర్థం కాదు. కానీ, ఇతరులతో పోలిస్తే వీరిలో ఆ ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
పొట్ట కొవ్వు ఎందుకంత ప్రమాదకరం..?
పొట్ట భాగంలోని అంతర్గత అవయవాల చుట్టూ పేరుకుపోయే కొవ్వును వైద్య పరిభాషలో 'విసెరల్ ఫ్యాట్' (Visceral Fat) అంటారు. ఇది కేవలం శరీరంలో నిల్వ ఉండే కొవ్వు మాత్రమే కాదు.. అత్యంత చురుకుగా ఉంటూ శరీరంలో అనేక జీవక్రియల మార్పులకు కారణమవుతుంది. కెమికల్స్ విడుదల..ఈ కొవ్వు నిరంతరం శరీరంలో వాపు (inflammation)ను కలిగించే రసాయనాలను, హార్మోన్లను విడుదల చేస్తుంది. హార్మోన్ల అసమతుల్యత: దీనివల్ల 'ఇన్సులిన్ నిరోధకత' (Insulin Resistance), హార్మోన్ల అసమతుల్యత ఏర్పడతాయి. ఇవి దీర్ఘకాలంలో క్యాన్సర్ కణాల పెరుగుదలకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి.
పొట్ట కొవ్వు వల్ల వచ్చే క్యాన్సర్లు ఇవే..
పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం కేవలం ఒక్క క్యాన్సర్‌కు కాదు, అనేక రకాల క్యాన్సర్లకు దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వాటిలో ప్రధానమైనవి.
1. పెద్దప్రేగు క్యాన్సర్ (Colon Cancer)..
పొట్ట చుట్టూ ఉండే కొవ్వు శరీరంలో ఇన్సులిన్, IGF-1 (ఇన్సులిన్-లైక్ గ్రోత్ ఫ్యాక్టర్-1) స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఈ మార్పుల వల్ల కణాలు అనియంత్రితంగా పెరిగి పెద్దప్రేగు, పురీషనాళ క్యాన్సర్లకు దారితీస్తాయి. అలాగే, ఊబకాయం వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియా (gut microbiome) దెబ్బతినడం కూడా క్యాన్సర్ ముప్పును పెంచుతుంది.
2. కాలేయ క్యాన్సర్ (Liver Cancer)..
నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) రావడానికి ప్రధాన కారణం బెల్లీ ఫ్యాటే. కాలేయంలో మోతాదుకు మించి కొవ్వు పేరుకుపోయినప్పుడు అది వాపు, ఫైబ్రోసిస్‌కు దారితీస్తుంది. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్‌గా మారుతుంది.
3. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్..
పొట్ట కొవ్వు వల్ల టైప్-2 డయాబెటిస్ (diabetes) వచ్చే ప్రమాదం అధికం. మధుమేహం ఉన్నవారిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
ప్రమాద ఘంటికలు.. మీ కొలతలు ఎలా ఉన్నాయి..?
ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి కేవలం బరువు (wait) చూసుకుంటే సరిపోదు.. నడుము చుట్టుకొలత ఎంతో ముఖ్యం. నడుము కొలతలు ఈ కింది విధంగా దాటితే వెంటనే అప్రమత్తం కావాలి..
పురుషుల్లో.. 90 సెం.మీ అంటే సుమారు 35 అంగుళాలు దాటితే ప్రమాదకరం.
మహిళల్లో ..80 సెం.మీ అంటే సుమారు 31.5 అంగుళాలు దాటితే ముప్పు ఉన్నట్లే.
నివారణ మార్గాలు..
సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే పొట్ట కొవ్వును కరిగించి, క్యాన్సర్ ముప్పు నుంచి సులభంగా బయటపడొచ్చు.వ్యాయామం..రోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు నడక, జాగింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. స్వీట్స్ కు చెక్.. తీపి పదార్థాలు, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. మీ రోజువారీ ఆహారంలో ప్రొటీన్లు, పీచు పదార్థాలు (fiber) ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
