Suffering from Neck or Back Pain. : మెడ, నడుము నొప్పితో ఇబ్బందిపడుతున్నారా..? అయితే, మీ దిండు మార్చాల్సిందే..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఉదయం నిద్రలేవగానే మెడ పట్టి వేసినట్లు అనిపిస్తుందా..? నడుము, భుజాల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా..? దీనికి కారణం మీ నిద్రలేమి మాత్రమే కాదు.. మీరు వాడుతున్న 'దిండు' కూడా కావచ్చు. అవును, కేవలం తలగడను ఒక సౌకర్యంగా మాత్రమే చూస్తాం. కానీ, సరైన దిండును ఎంచుకోకపోతే అది వెన్నెముక, మెడ, మొత్తం శరీర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రశాంతమైన, గాఢమైన నిద్ర కోసం తగినంత సమయం పడుకోవ డమే కాదు.. మన నిద్రపోయే భంగిమకు తగిన దిండును ఎంచుకోవ డం ఎంతో అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మీ నిద్రపోయే భంగిమ-దానికి తగిన దిండు..మనం నిద్రించే పద్ధతిని బట్టి ఎలాంటి దిండు వాడాలో ఇక్కడ తెలుసుకుందాం..

 

 ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

పక్కకు తిరిగి పడుకునే వారు.. 

ఎక్కువ మంది ఇలాగే పడుకుంటారు. ఈ భంగిమలో నిద్రించే వారు కాస్త మందంగా, గట్టిగా ఉండే దిండును వాడాలి. పక్కకు తిరిగినప్పుడు తలకు, భుజానికి మధ్య ఎక్కువ ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీని భర్తీ చేసేలా దిండు ఉన్నప్పుడే కండరాలపై ఒత్తిడి తగ్గి, మెడ నిటారుగా ఉంటుంది.

వెల్లకిలా పడుకునే వారు..

ఆరోగ్యపరంగా నిద్రలో ఇదే అత్యుత్తమ భంగిమ. ఇలా పడుకున్న ప్పుడు వెన్నెముక, మెడ, భుజాలు వాటి సహజ స్థితిలో ఉంటాయి. వీరు మరీ ఎత్తుగా లేదా పల్చగా కాకుండా, ఓ మధ్యస్థంగా ఉన్న దిండును వాడాలి. ఇలా వెల్లకిలా పడుకోవడం వల్ల చర్మానికి రాపిడి తగ్గి ముఖంపై ముడతలు కూడా రావు.

బోర్లా పడుకునే వారు..

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది సరైన భంగిమ కాదు. ఇలా పడుకోవడం వల్ల మెడ ఒకవైపుకు వంగిపోయి వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది నొప్పులకు దారితీస్తుంది. ఒకవేళ మీకు ఇలా పడుకునే అలవాటు ఉంటే.. వీలైనంత పలుచటి దిండును వాడటం లేదా అసలు దిండు లేకుండా పడుకోవడం మంచిది.

వెన్నెముక అమరిక ఎంతో కీలకం..

మన వెన్నెముక స్కేలులా పూర్తిగా నిటారుగా ఉండదు.. ఆంగ్ల అక్షరం 'S' ఆకారంలో సహజమైన వంపులతో ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మనం వాడే దిండు ఈ వంపులను సమతుల్యం చేయాలి. తల, మెడ, వీపు భాగాలను ఒకే వరుసలో తటస్థంగా ఉంచే దిండును వాడటం వల్ల కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా నొప్పుల బారిన పడకుండా ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది.

నిపుణులు ఏమంటున్నారు అంటే..?

మనిషి తన జీవితకాలంలో మూడింట ఒక వంతు సమయం నిద్రకే కేటాయిస్తాడు. కాబట్టి, మన శరీర ఆకృతి, నిద్రించే భంగిమను బట్టి సరైన దిండును ఎంచుకోవాల ఫిజియోథెరపిస్టుల సూచుస్తున్నారు.
"మీ భుజాలు, తల మధ్య ఉన్న దూరాన్ని సమానంగా భర్తీ చేస్తూ.. ఆసరా ఇచ్చే మధ్యస్థ ఎత్తు ఉన్న దిండును వాడటం అన్ని విధాలా ఉత్తమం" అని వారు స్పష్టం చేస్తున్నారు. మీ పరుపు, దిండు మార్చిన తర్వాత కూడా మెడ, నడుము నొప్పులు తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.

 

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.