హైపర్‌టెన్షన్ విషయంలో ఎలాంటి ఫుడ్ ను వదిలేయాలి..?
సాక్షి లైఫ్ : కొన్ని అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్నిరకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే కొన్ని రకాల వ్యాధుల విషయంలో కూడా కొన్ని రకాల ఆహారాలను తీసుకోకుండా ఉండడం ద్వారా మరింత ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. అదేవిధంగా హై బ్లడ్ ప్రెషర్(హై బీపీ) విషయంలోనూ అలాంటి జాగ్రత్తలే అవసరమని అంటున్నారు.. హై బీపీని హైపర్‌టెన్షన్ అనికూడా అంటారు.
ఇది కూడా చదవండి..Reduce stress : స్ట్రెస్ తగ్గాలంటే ఎలాంటి ఫుడ్స్ అవసరం..?
ఇది కూడా చదవండి.. దంత సమస్యలు.. వాస్తవాలు..
ఇది కూడా చదవండి.. ఐస్ట్రోక్ అంటే ఏమిటి..? కారణాలు, లక్షణాలు, చికిత్స..?
ఇది కూడా చదవండి.. మైగ్రేన్ పెయిన్ కు గుండెపోటుకు లింక్ ఏంటి..?
ఈ సమస్య వచ్చిందంటే గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మెదడు సంబంధిత రక్తనాళాల్లో ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి.హైపర్ టెన్షన్ విషయంలో పలురకాల జాగ్రత్తలు పాటించడం ద్వారా హెల్తీ గా ఉండొచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తే చాలావరకూ ఎలాంటి ఇబ్బందులు ఉండవని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. అధిక రక్తపోటు రాకుండా ఉండేందుకు ఏం చేయాలి? ఏం చేస్తే అటువంటి సమస్య నుంచి బయట పడొచ్చనేది ఇప్పుడు తెలుసుకుందాం..
వంటల తయారీలో నూనెలు, కొవ్వు పదార్థాల వినియోగం తగ్గించాలి. మసాలాలు, కారం వాడకాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఉప్ప వినియోగం చాలా తగ్గించాలి. పొగతాగడం, మద్యం సేవించడం మానుకోవాలి. ప్రతినిత్యం అర్థగంటకు తక్కువ కాకుండా వ్యాయామం చేయాలి. అంతేకాదు నిల్వ పచ్చళ్లు, నిల్వ ఉంచిన ఆహారాలు, బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు, క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి.
వేపుడ్లు, చిప్స్, కేకులు, బిస్కెట్లు, నూడుల్స్, పిజ్జా వంటి ట్రాన్స్ క్రొవ్వు పదార్థాలను పూర్తిగా మానెయ్యాలి. శరీర బరువును తగ్గించుకోవాలి. శరీరానికి ఒత్తిడి, తోపాటు అనవసరంగా ఆందోళన చెందకుండా ఉండాలి. పలురకాల అలవాట్లను మార్చుకోవడం ద్వారా హైపర్‌టెన్షన్‌ను సమస్యను నియంత్రించవచ్చు.
ఇది కూడా చదవండి.. బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిందని ఎలా తెలుసుకోవచ్చు అంటే..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
