Foot Odor : పాదాల దుర్వాసన వేధిస్తోందా..? ఈ చిట్కాలతో రోజంతా ఫ్రెష్‌గా ఉండండి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వేసవి కాలంలో చెమట పట్టడం సహజం. అయితే చాలామందికి పాదాల నుంచి వచ్చే దుర్వాసన పెద్ద సమస్యగా మారుతుంది. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లేవారు, రోజంతా షూస్, సాక్స్ వేసుకునే వారిలో ఈ ఇబ్బంది మరీ ఎక్కువ. ఇది నలుగురిలో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా, ఇబ్బందికరమైన పరిస్థితిని తెచ్చిపెడుతుంది. అయితే కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.

 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..

 

పాదాల నుంచి దుర్వాసన ఎందుకు వస్తుంది..?

శరీరంలోని ఇతర భాగాలతో పోలిస్తే పాదాల్లో చెమట గ్రంథులు (Sweat Glands) ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ సమయం షూస్ వేసుకోవడం వల్ల గాలి ఆడక, పట్టిన చెమట బయటకు వెళ్లలేక అక్కడే ఆగిపోతుంది. ఈ తేమ కారణంగా షూస్ లోపల బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా వృద్ధి చెంది దుర్వాసనకు దారితీస్తాయి. సరైన ఫుట్‌వేర్ ఎంచుకోకపోవడం, పాదాల పరిశుభ్రత పాటించకపోవడం కూడా దీనికి ప్రధాన కారణాలు.

దుర్వాసనను అరికట్టే అద్భుత మార్గాలు..

ఉతికిన సాక్స్‌ను మాత్రమే ప్రతిరోజూ వాడాలి. వేసవిలో నైలాన్ లేదా సింథటిక్ సాక్స్‌కు బదులుగా కాటన్ సాక్స్ వాడటం ఉత్తమం. ఇవి చెమటను త్వరగా పీల్చుకుని, పాదాలను పొడిగా ఉంచడంలో సహాయపడతాయి.

పాదాలు పొడిగా ఉంచుకోవాలి..

 స్నానం చేసిన తర్వాత లేదా కాళ్లు కడుక్కున్న తర్వాత పాదాలను, ముఖ్యంగా వేళ్ల మధ్య భాగాన్ని పొడిగా తుడుచుకోవాలి. తడిగా ఉంటే ఫంగస్, బ్యాక్టీరియా త్వరగా చేరుతాయి. పాదాలకు చెమట ఎక్కువగా పట్టేవారు ఫుట్ పౌడర్ లేదా యాంటీ ఫంగల్ పౌడర్ వాడొచ్చు.

షూస్‌ను ఎండలో ఉంచాలి..

రోజూ ఒకే జత షూస్ వేసుకోకుండా, రెండు జతలను మార్చి మార్చి వాడుతుండాలి. వాడిన తర్వాత వాటిని ఎండలో లేదా గాలి తగిలే చోట ఉంచితే, లోపల ఉన్న తేమ ఆరిపోయి బ్యాక్టీరియా నశిస్తుంది.

నిమ్మ, బేకింగ్ సోడాతో ఉపశమనం..

ఒక టబ్‌లో గోరువెచ్చని నీరు తీసుకుని, అందులో కొద్దిగా బేకింగ్ సోడా, నిమ్మరసం కలపాలి. ఆ నీటిలో పాదాలను 15 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియా నశించి, పాదాలు తాజాగా మారతాయి.

పటిక (Fitkari) నీరు..

పటికలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయి. పటిక కలిపిన నీటితో పాదాలను శుభ్రం చేసుకోవడం వల్ల దుర్వాసన చాలా వరకు తగ్గుముఖం పడుతుంది.

గాలి ఆడే చెప్పులు వాడండి..

మరీ బిగుతుగా ఉండే షూస్ వేసుకోవద్దు. దీనివల్ల గాలి ఆడక చెమట మరింత ఎక్కువగా పడుతుంది. వేసవిలో వీలైనంత వరకు గాలి ఆడే ఫుట్‌వేర్ ఎంచుకోవడం మంచిది.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..?

దుర్వాసనతో పాటు పాదాల్లో విపరీతమైన దురద, ఎర్రబడటం లేదా వేళ్ల మధ్య చర్మం పొలుసులుగా రాలడం వంటి లక్షణాలు కనిపిస్తే అది ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు సంకేతం కావచ్చు. ఇలాంటప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం.

 

 ఇది కూడా చదవండి.. Dental problems : క్లీనింగ్ చేయిస్తే పళ్లు బలహీనపడతాయా..? ఇందులో నిజమెంత..?

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది.. 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.